»   » అయ్యో కమల్...! అంత మాటన్నారేంటీ..?

అయ్యో కమల్...! అంత మాటన్నారేంటీ..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ హసన్ ఓటు వేయడట. సినిమా తారలంతా ఓటువేయండహో అని స్పెషల్ గా ప్రకటనల్లో కనిపించి మరీ ప్రజల్లో ఓటుహక్కు అవగాహన పెంచుతుంటే.. ఒక భాధ్యత గల పౌరుడిగా,కొంతమందిని ప్రభావితం చెయగలిగే పేరున్న సెలెబ్రిటీ గా కమల హసన్ ఈ వ్యాఖ్యలు చేయటం ఒకింత ఆశ్చర్యంగానే అనిపించినా.. ఇదినిజమే స్వయంగా కమల్ ఈ మాటలు చెప్పారు. రానున్న తమిళనాడు ఎన్నికల్లో నేను ఓటు వేయబోవటం లేదంటూ కమల్ పాత్రికేయులతోనే చెప్పారు....

సంగతేంటంటే కమల్ తాజా ప్రజెక్టు శభాశ్ నాయుడు వస్తున్న సంగతి తెలిసిందే కదా.. దశావతారం చిత్రంలోని పది పాత్రలలో ఒకటైన బలరామ్‌నాయుడు పాత్ర విస్తరించి చేస్తున్న సినిమా శభాష్‌నాయుడు కు సంబందించిన షూట్ మే నెల 14 నుంచి అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో రెగ్యులర్ గా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

What exactly Kamal said about voting in Tamil Nadu Election

అయితే మే నెల 16న తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి కదా! మీరు ఓటు హక్కు వినియోగించుకోరా? అంతూ ఒక పాత్రికేయుడు ప్రశ్నకు తాను ఓటు వేయను అన్నారు. అదేంటీ...? అనీడగగా... ఈ సారి ఓటు పట్టికలో తన పేరు లేదని వివరించారు.

గత పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయాలని వెళితే అప్పటికే తన ఓటును వేరెవరో వేసేశారని, ఈ సారన్నా ఓటు హక్కును వినియోగించుకోవాలని భావించగా ఓటరు పట్టికలో తన పేరే లేదన్నారని, ఎన్నికల కమిషనర్ తనకు మంచి మిత్రుడే అయినా ఏం లాభం నా బతుకిలా అయ్యింది అంటూ నిట్టూర్చి అందర్నీ నవ్వించాడు... కమల్ హసన్

English summary
Kamalhaasan will not vote in the upcoming Tamil Nadu State Assembly Elections to be held on May 16.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu