»   » టుడే నైట్ పార్టీ.. నాగార్జునకు అమల మెసేజ్.. మన్మధుడి జీవితాన్ని మలుపు తిప్పిన..

టుడే నైట్ పార్టీ.. నాగార్జునకు అమల మెసేజ్.. మన్మధుడి జీవితాన్ని మలుపు తిప్పిన..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో అన్యోన్యమైన దంపతుల్లో నాగార్జున, అమల జంట ఒకటి. వివాదాలకు దూరంగా ఉంటూ సాధ్యమైనంత వరకు సమాజానికి ఉపయోగపడే పనుల చేస్తుంటారు. విహార యాత్రలు, పార్టీలలో పాలుపంచుకొంటూనే లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుంటారు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా రిలీజ్ పనిలో పడిన నాగార్జున.. జీవితాన్ని మలుపు తిప్పిన అత్యంత కీలకమైన విషయాన్ని మరిచిపోయాడు. ఆ విషయాన్ని పరోక్షంగా గుర్తు చూస్తూ అమల మొబైల్ ఫోన్‌లో ఓ ఎస్సెమ్మెస్ పంపి నాగ్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయాన్ని రారండోయ్ వేడుక చూద్దాం గురించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వయంగా నాగార్జున వెల్లడించారు.

31 ఏళ్లు పూర్తి..

31 ఏళ్లు పూర్తి..

టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జునను అమల ఆశ్చర్యానికి గురిచేయడం వెనుక అసలు విషయం ఏమిటంటే.. అక్కినేని అభిమానులకు తెలుగు సినిమా పరిశ్రమ యువసామ్రాట్ నాగార్జునను అందించి మే 23 తేదీనే. అంటే హీరోగా అక్కినేని నాగార్జున నటించిన విక్రమ్ సినిమా రిలీజ్ నేటికి 31 ఏళ్లు. విక్రమ్ సినిమా మే 23వ తేదీ 1986 తేదీన విడుదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రూపొందిన ఈ సినిమాలో శోభన హీరోయిన్.

హీరో రీమేక్‌లో..

హీరో రీమేక్‌లో..

హిందీలో సంచలన విజయం సాధించిన హీరో సినిమాను తెలుగులో రీమేక్‌గా విక్రమ్ చిత్రంగా తెరకెక్కించారు. హిందీలో జాకీష్రాఫ్ పోషించిన పాత్రను నాగార్జున, మీనాక్షి శేషాద్రి ధరించిన పాత్రను శోభన చేశారు. ఈ సినిమాకు దర్శకుడు వీ మధుసూదన్ రావు. హిందీలో ఈ సినిమాను సుభాష్ ఘాయ్ తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకొన్నది. హిందీలో హీరో చిత్రం ద్వారానే జాకీష్రాఫ్ బాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే.

1967లోనే బాలనటుడిగా..

1967లోనే బాలనటుడిగా..

వాస్తవానికి 1967లోనే సుడిగుండాలు చిత్రంలో నాగార్జున బాల నటుడిగా నటించినట్టు సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. ఈ చిత్రంలో హీరోగా నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించారు. ఆ తర్వాత చాలా ఏళ్ల అనంతరం 1986లో మళ్లీ హీరోగా నాగార్జున తెరంగేట్రం చేశారు. అప్పటి నుంచి వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తూ టాలీవుడ్‌లో మన్మధుడిగా మారిపోయారు.

నేడు ఇంట్లో జోరుగా విందు..

నేడు ఇంట్లో జోరుగా విందు..

విక్రమ్ సినిమా రిలీజై 31 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భాన్ని గుర్తు చేస్తూ అమల ఎస్సెమ్మెస్ పంపి ఉంటుందని నాగార్జున వెల్లడించారు. టుడే నైట్ పార్టీ అంటే నాగ్ ఇంట్లో విందు జోరుగా ఉండే అవకాశం ఉంది. ఈ పార్టీలో చైతూ, సమంత, అఖిల్, తనకు సన్నిహితులైన వారు పాల్గొనే అవకాశం కూడా ఉంది.

English summary
Akkineni Nagarjuna began acting as a lead actor through the 1986 Telugu film Vikram, directed by V. Madhusudhana Rao. It is the remake of the 1983 Hindi film Hero. The film was a success, giving Nagarjuna a good start.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu