»   » ‘బాహుబలి’ స్టార్ ప్రభాస్ ఇప్పుడెక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?

‘బాహుబలి’ స్టార్ ప్రభాస్ ఇప్పుడెక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కేవలం ఒక ప్రాజెక్టు కోసం ఐదేళ్ల సమయం కేటాయించడం అంటే మామూలు విషయం కాదు. ఇండియాలో ప్రభాస్ తప్ప ఏ హీరో కూడా ఇలాంటి సాహసం చేయడేమో!. మొదట ప్రభాస్ ఈ పనికి సిద్ధమైనపుడు చాలా మంది రిస్క్ చేస్తున్నావన్నారు. ప్రభాస్ గానీ, రాజమౌళి గానీ ఇలాంటి రిస్క్ చేయకుంటే ఈ రోజు బాహుబలి లాంటి భారీ సినిమా ఇండియన్ స్క్రీన్ మీద ఉండేదా? ఈ ప్రపంచం ఇండియన్ సినీ పరిశ్రమ గురించి గొప్పగా మాట్లాడుకునేదా? ప్రభాస్, రాజమౌళి పడ్డ కష్టానికి ఇండియన్ సినీ ప్రేక్షకులు తగిన ఫలితమే అందించారు.

ఇన్ని సంవత్సరాలు సినిమా షూటింగులు, ప్రమోషన్స్ అంటూ బిజీ బిజీగా గడిపిన ప్రభాస్ ప్రస్తుతం యూఎస్ఏలో రిలాక్స్ అవుతున్నాడు.


ముందే ప్లాన్ చేసుకున్నాడు

ముందే ప్లాన్ చేసుకున్నాడు

బాహుబలి షూటింగులో ఉన్న సమయంలో.... ఇక్కడ పని అయిపోయిన వెంటనే ప్రభాస్ యూఎస్ఏ వెళ్లి కొన్ని రోజులు రిలాక్స్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అందుకు తగిన విధంగా ముందే ప్లాన్ చేసుకున్నాడు.


రాజమౌళి వెళ్లనివ్వ లేదు

రాజమౌళి వెళ్లనివ్వ లేదు

వాస్తవానికి సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రభాస్ యూఎస్ఏ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే రాజమౌళి సినిమా ప్రమోషన్స్ పూర్తయ్యే వరకు వెళ్లకుండా అడ్డుకున్నాడని సమాచారం.


త్వరలో సాహో షూటింగ్

త్వరలో సాహో షూటింగ్

బాహుబలి తర్వాత ప్రభాస్ ‘సాహో' సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా యూఎస్ఏలోనే జరుగబోతోంది. అందుకే తన వెకేషన్‌ను యూఎస్ఏలోనే ప్లాన్ చేసుకున్నాడు.


ప్రైవేట్ ప్లేసులో

ప్రైవేట్ ప్లేసులో

అమెరికాలో ప్రభాస్ ఎక్కువగా ప్రైవేట్ ప్లేసుల్లోనే గడుపుతున్నట్లు సమాచారం. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. పబ్లిక్ ప్రదేశాల్లో అయితే ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని తాను గడపడానికి కొన్ని ప్రత్యేకమైన ప్లేసులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.English summary
Prabhas dedicated five years of his life to SS Rajamouli's magnum opus Baahubali. The film has broken all the records worldwide and has created history. We all know that Prabhas has taken a break after the mammoth success of the movie and is in the US these days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu