»   » నటన కోసం వస్తే చెత్త ఊడ్పించారు, అయినా సరే... గబ్బర్ సింగ్ విలన్ నిజ జీవితం లో...

నటన కోసం వస్తే చెత్త ఊడ్పించారు, అయినా సరే... గబ్బర్ సింగ్ విలన్ నిజ జీవితం లో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ గాడ్ ఫాదరూ లేకుండా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం మామూలు విషయమేం కాదు. ఒక్క అవకాశం కోసం సినీ ఆఫీసుల చుట్టూ, స్టుడియోల చుట్టూ ఎంతోమంది తిరుగుతూంటారు అందరి కలా ఒక్కటే. తాను తెర మీద కనిపించాలి, కొందరు డబ్బుకోసం అయితే మరికొందరికి నటన మీద ఉన్న పిచ్చి ఫ్యాషన్ అక్కడికి లాక్కువెళ్తుంది. ఆత్మాభిమానం చంపుకొని అందర్నీ బతిమాలుతూ, ఆకలిని చంపుకొని రోడ్లన్నీ తిరుగుతూ ఒక్క చాన్స్ కోసం తిరిగే వాళ్ళే.. రామ్ గోపాల్ వర్మ 'రక్తచరిత్ర'లో బుక్కా రెడ్డిగా.. పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్'లో సిద్దప్పనాయుడిగా అద్భుత అభినయం ప్రదర్శించిన అభిమన్యు సింగ్ కూడా ఈ కోవకే చెందుతాడు. అతను కెరీర్ ఆరంభంలో చాలా కష్టాలే పడ్డాడు. బ్రేక్ కోసం చాలా స్ట్రగులయ్యాడు.

అభిమన్యుసింగ్ స్వస్థలం బిహార్‌రాజధాని పట్నా. 'బాలీవుడ్' కలలతో ముంబైకి చేరుకున్నాడు. నిర్మాతల ఆఫీసుల చుట్టూ బొంగరంలా తిరిగాడు. కొంచెం కూడా ఫలితం కనిపించలేదు. 'థియేటర్' రూట్ నుంచి వెళితే...ప్రయాణం కాస్త సులువవుతుంది అనుకొని మకరంద్ దేశ్‌పాండే థియేటర్ గ్రూప్ 'అంశ్'లో చేరాడు అయితే అక్కడి వెళ్ళగానే నటించటం మొదలైపోతుందనుకున్న అభిమన్యు కి ఊహించలేని షాక్ తగిలిందట. తన కెరీర్ తొలినాళ్ళలో ఎదుర్కొన్న కొన్ని అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అందులో తాను అప్పట్లో పడ్డ కష్టాలను కూడా చెప్తూ నటించటం కోసం తాను ఆఫీస్ ఫ్లోర్ కూడా ఊడ్చాల్సి వచ్చిందని ఆ సంఘటన గురించి ఇలా చెప్పాడు .

When Abhimanyu singh was asked to Sweep the Floor

ఆఫీసులోకి అడుగుపెట్టగానే మకరంద్.. చీపురు చేతిలో ఆఫీస్ ఊడ్చమని చెప్పాడట. అభిమన్యు కోపంతో రగిలిపోయాడట కానీ.. కెరీర్ కోసం కోపం అణుచుకుని చెప్పింది చేశాడట. కొన్నాళ్ల తర్వాత మకరంద్.. అభిమన్యును నటనలో తీర్చిదిద్దాడు. 'అంశ్' థియేటర్ గ్రూప్‌లో కె.కె. మీనన్, అనురాగ్ కశ్యప్‌లు అభిమన్యుకు సీనియర్లు. 'బాగా నటిస్తున్నాడు' అని పేరైతే వచ్చిందిగానీ... సినిమాల్లో అవకాశాలేవీ రావడం లేదు. తన రూమ్‌లో ఒంటరిగా ఏడ్చిన రోజులెన్నో ఉన్నాయి.,,పట్నాలో ఉన్నప్పుడు నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నుంచి ఒకరోజు ఫోన్ వచ్చింది.

కట్ చేస్తే... రాకేష్ మెహ్ర 'అక్స్'లో పోలీస్ పాత్ర పోషించే అవకాశం దక్కింది. అయితే... ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర నిరాశపరచడంతో... అభిమన్యు కెరీర్‌కు ఉపయోగపడలేదు. మళ్లీ స్ట్రగుల్....'లక్ష్య్' 'డోల్' 'జన్నత్' సినిమాల్లో నటించాడుగానీ... కెరీర్ స్పీడ్ అందుకోలేదు. అయితే... 'గులాల్' సినిమాతో కెరీర్ టర్నింగ్ తీసుకుంది. ప్రముఖుల దృష్టిలో పడే అవకాశం వచ్చింది.. చివరికి 'గులాల్'తో బ్రేకొచ్చింది. 'రక్తచరిత్ర'తో దక్షిణాది సినిమాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. చెడు పాత్రలను 'ఎంత మంచిగా చేశాడు' అనిపించుకోవడం అంత తేలికేమీకాదు... అందుకే అభిమన్యు సింగ్ 'ఉత్తమ విలన్' అనిపించుకున్నాడు.

English summary
Abhimanyu singh who played a role "Siddappa Naidu" in Pawan kalyan's "Gabbar sing" Movie, is shared some memories from his earlier days in Bollywood
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu