»   » సినీ తెరపై జయలలితగా ఐశ్వర్యా రాయ్: అసలేం జరిగింది?

సినీ తెరపై జయలలితగా ఐశ్వర్యా రాయ్: అసలేం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం మణిరత్నం తమిళంలో ఇరువరుగా తెలుగులో ఇద్దరుగా తీసిన సినిమా చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఐశ్వర్యా రాయ్ జయలలిత పాత్రను పోషించారు.

ఐశ్వర్యారాయ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. అసలు ఈ సినిమాలో ఆ పాత్ర వేసే అవకాశం ఐశ్వర్యా రాయ్‌కి విచిత్రంగా వచ్చింది. ఎంజి రామచంద్రన్, కరుణానిధి పాత్రల కోసం మణిరత్నం చాలా మంది నటులను సంప్రదించారని చెబుతారు.

ఇద్దరు సినిమాలో ఐశ్వర్యా రాయ్ పోషించిన పాత్రను ఇప్పటికీ సినీ అభిమానులు మరిచిపోలేరంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమాతోనే ఐశ్వర్యా రాయ్ సినీ రంగ ప్రవేశం చేశారు.

ఆ ముగ్గురి ఆ పాత్రలు వేశారు...

ఆ ముగ్గురి ఆ పాత్రలు వేశారు...

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎంజి రామచంద్రన్ పాత్రను మోహన్ లాల్ పోషించగా, కరుణానిధి పాత్రను ప్రకాష్ రాజ్ వేశారు. జయలలిత పాత్రలో ఐశ్వర్యా రాయ్ నటించారు.

ఐష్ డబుల్ రోల్

ఐష్ డబుల్ రోల్

ఇద్దరు సినిమాలో ఐశ్వర్యా రాయ్ ద్విపాత్రాభినయం చేశారు. ఆమె నటనకు, అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారంటే అతిశయోక్తి కాదు. ఆమె రెండు పాత్రల్లోనూ అద్భుతంగా నటించారు.

కొత్త నటి కోసం మణిరత్నం...

కొత్త నటి కోసం మణిరత్నం...

మోహన్ లాల్‌ను ఎంజి రామచంద్రన్ పాత్రకు ఎంపిక చేసుకున్న తర్వాత ఆయన సరసన కొత్త నటిని ఎంపిక చేసుకోవాలని మణిరత్నం అనుకున్నారు. ఈ సినిమాలో టబు, గౌతమి కూడా నటించారు.

నానా పటేకర్ కోసం ప్రయత్నం..

నానా పటేకర్ కోసం ప్రయత్నం..

కరుణానిధి పాత్ర కోసం మణిరత్నం నానా పటేకర్‌ను ఎంపిక చేసుకోవాలని అనుకున్నారట. అయితే, ఆయన అందుకు అంగీకరించలేదని అంటారు.

వారంతా వద్దన్న తర్వాత ప్రకాష్ రాజ్

వారంతా వద్దన్న తర్వాత ప్రకాష్ రాజ్

కరుణానిధి పాత్ర కోసం మణిరత్నం మమ్మూట్టి, కకమల్ హసన్, సత్యరాజ్, మిథున్ చక్రవర్తి, శరత్ కుమార్ తదితరులను సంప్రదించారని చెపుతారు. అయితే వారెవరూ అంగీకరించలేదని అంటారు. దాంతో అప్పట్లో అంతగా పేరు ప్రఖ్యాతులు లేని ప్రకాష్ రాజ్‌ను ఎంపిక చేసుకున్నారు. ఆయన ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు లభించింది.

ఆ సినిమాతోనే ఐష్‌కు...

ఆ సినిమాతోనే ఐష్‌కు...

మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ వంటి నటులున్నప్పటికీ, మణిరత్నం సినిమా అయినా ఐశ్వర్యా రాయ్ ఆ సినిమాలో తనదైన ముద్రను వేశారు. దాంతో ఆమెకు ఆ తర్వాత సినిమాల్లో విరివిగా ఆవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత కూడా మణిరత్నం సినిమాల్లో ఆమె నటిస్తూ వచ్చారు.

English summary
ishwarya Rai Bachchan had made her feature film debut with Mani Ratnam's 'Iruvar,' which connoisseurs and fans alike, still rate to be his best, till date.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu