మంచు లక్ష్మి ‘గుండెల్లో...’ ఏమైంది?

By Bojja Kumar

హైదరాబాద్: మంచు లక్ష్మి ప్రసన్న నిర్మిస్తున్న 'గుండెల్లో గోదారి' చిత్రం అప్పుడెప్పుడో రిలీజ్ చేస్తామని చెప్పి... వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయిత గత కొన్ని రోజులుగా ఈచిత్రం అసలు వార్తలో లేకుండా పోయింది. నిర్మాత మంచు లక్ష్మిగానీ, దర్శకుడు గానీ ఈ సినిమా విషయమై ఈ మధ్య ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు కూడా లేవు. దీంతో 'గుండెల్లో గోదారి' సినిమా ఏమైందనే చర్చ సినీ ప్రేమికుల్లో నెలకొంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రం...విడుదల వచ్చే ఏడాది (2013)కు వాయిదా వేసారి, సంక్రాంతి తర్వాత కానీ రిలీజ్ అయ్యే పరిస్థితి లేదని, అందుకే నిర్మాత లక్ష్మితో పాటు అందరూ ఈ సినిమా గురించి సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది. వాస్తవానికి ఈచిత్రాన్ని నవంబర్లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ డమరుకం, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రాల నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదే వేసారు.

ఆతర్వాత రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ.... క్రిస్ మస్, సంక్రాంతి బరిలో అనేక పెద్ద సినిమాలు ఉండటం, థియేటర్ల సమస్య కూడా ఉండటంతో సినిమా విడుదలను కొంత కాలం వాయిదా వేసుకోవడమే మేలనే నిర్ణయానిక వచ్చారు నిర్మాతలు. సంక్రాంతి తర్వాత ఈచిత్రం విడుదలపై క్లారిటీ రానుంది.

ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది. 1986లో వచ్చిన వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు. ముమైత్ ఖాన్ ఐటం సాంగు చేస్తోంది. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది.

కథా వస్తువు మత్స్యకారుల జీవితాలకి సంబంధించినది కావడం వల్ల, పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలోని 27 ఎకరాలలో 120 గుడిసెలతో కూడిన పల్లె సెట్ ను వేశారు. చిత్రం చాలా వరకు పాలకొల్లు,అమలాపురం మరియు గోదారి జిల్లాల పరిసరాలలో తెరకెక్కించారు. ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రానికి సమర్పణ:మోహన్‌బాబు.ఎం. నిర్మాత:మంచు లక్ష్మీ ప్రసన్న, దర్శకత్వం:కుమార్ నాగేంద్ర.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X