»   » రజినీతో సినిమా ఆఫర్ని తిరస్కరిస్తూ జయ లలిత రాసిన లేఖ ఇదే... అమ్మ దస్తూరీ..

రజినీతో సినిమా ఆఫర్ని తిరస్కరిస్తూ జయ లలిత రాసిన లేఖ ఇదే... అమ్మ దస్తూరీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ సినీనటి, తమిళనాడు దివంగత సీఎం జయలలిత.. దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ మధ్య మొదట కొంత వ్యతిరేక భావనలు ఉండేవి. అయితే, ఆ తర్వాత అదంతా మారిపోయింది. తొలినాళ్లలో జయను వ్యతిరేకించిన రజినీకాంత్.. ఆ తర్వాత కాలంలో ఆమెకు మద్దతునివ్వడం మొదలుపెట్టారు. ఇలా ఆమెపై రజినీ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు.

1996లో 'జయలలిత అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడు' అని రజినీకాంత్.. చేసిన ఈ ఒకే ఒక్క వ్యాఖ్య ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో జయ ప్రత్యర్థుల సోలో నినాదంగా మారిపోయింది. అయితే, అదే రజనీకాంత్ 2011లో 'జయలలిత విజయం తమిళనాడును కాపాడింది' అని ప్రకటించడం గమనార్హం. అయితే సినీ రంగం నుంచే రాజకీయాల్లోకి వచ్చిన జయ లలిత రజినీ కాంత్ తో కూడా నటించాల్సింది... కానీ రజినీ పక్కన హీరోయిన్ గా కనిపించే అవకాశం వచ్చినా మన దురదృష్ట వశాత్తూ ఆ అరుదైన కాంబినేషన్ ని చూడలేక పోయాం...

దక్షిణాదిన ఎన్టీయార్‌, ఏఎన్నార్‌, ఎమ్జీయార్‌, శివాజీ గణేషన్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించారు జయలలిత. 60ల్లో సినీ కెరీర్‌ ప్రారంభించిన జయలలిత 70వ దశకానికి స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కు చేరుకున్నారు. ఇక, దాదాపు 1980తో తన సినిమా జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఆ తర్వాత ఎమ్జీయార్‌ ఆహ్వానం మేరకు ఏడీఎంకే పార్టీ తీర్థం పుచ్చుకుని పార్టీ ప్రచారం చేస్తున్న సమయంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన నటించే అవకాశం వచ్చిందట జయలలితకు.

 When Jayalalithaa turned down Rajinikanth's Billa

ఆ సమయంలో రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న 'బిల్లా' సినిమాలో హీరోయిన్‌గా నటించమని జయలలితను అడిగారట. అయితే రాజకీయాలపైనే పూర్తిగా దృష్టి సారించిన జయలలిత ఆ ఆఫర్‌ను తిరస్కరించారట. జయలలిత తిరస్కరించాకే ఆ ఆఫర్‌ హీరోయిన్‌ శ్రీప్రియ (దృశ్యం సినిమా డైరెక్టర్‌)కు దక్కింది. తాను ఆ సినిమాలో చేయలేను అంటూ రాసినలేఖ ఇప్పుడు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది...

 When Jayalalithaa turned down Rajinikanth's Billa
English summary
Going by report, Jayalalithaa was supposed to star opposite superstar Rajinikanth in the latter's Billa (1980). Amma was offered an important role in Billa, which is the Tamil remake of the Hindi film Don.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu