twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆశ్చర్యం :జూ.ఎన్టీఆర్ కి డబ్బింగ్ చెప్పాడు

    By Srikanya
    |

    హైదరాబాద్: జూ.ఎన్టీఆర్ కి డబ్బింగ్ చెప్పటమేంటి..నిజం అయ్యిండదు అనుకుంటున్నారా... కాని నిజమే.. జూ.ఎన్టీఆర్ కు శశాంక్ వెన్నెల కంటి డబ్బింగ్ చెప్పారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా తెలియచేసారు. ఎన్టీఆర్ తొలి చిత్రం నిన్ను చూడాలని లో కొన్ని చోట్ల ఎన్టీఆర్ కి డబ్బింగ్ చెప్పానని అన్నారు. ఇప్పటి వరకూ శశాంక్ దాదాపు వందకు కి పైగా సినిమాలకి డైలాగ్స్ రాసారు మరియు డబ్బింగ్ చెప్పారు.

    ఎన్టీఆర్ ఇప్పుడు 'రభస' తర్వాత కూడా మరో రెండు ప్రాజెక్టులు ఓకే చేశాడు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో (ఈ సినిమాకు 'రుబాబు' అనే పేరు పరిశీలనలో ఉంది) ఓ సినిమా త్వరలో ప్రారంభమవుతుంది. మరోవైపు వక్కంతం వంశీ సినిమా కూడా త్వరలో పట్టాలెక్కబోతోంది. దీంతో పాటు నాగార్జునతో కలసి మల్టీస్టారర్‌ సినిమా కూడా అంగీకరించాడు ఎన్టీఆర్‌. దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారు.

    When Jr NTR relied on Mr.Shashank?

    జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజాచిత్రం 'రభస'. సమంత, ప్రణీత ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌తో 'కందిరీగ' తీసి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న సంతోష్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం బిజినెస్ మంచి క్రేజ్ తో సాగుతోంది.

    చిత్ర సమర్పకుడు బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ ''ఆది' తరవాత ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న విధానం బాగుంది. ఎన్టీఆర్‌ డ్యాన్సులు, పోరాటాలు అభిమానులకు థ్రిల్‌ కలిగిస్తాయి'' అన్నారు. దర్శకుడు చెబుతూ ''ఎన్టీఆర్‌ అభిమానులకు ఈ సినిమా పండగలా ఉంటుంది. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. తమన్‌ చక్కటి పాటలిచ్చారు''అన్నారు. సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రభస'. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు.

    ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

    English summary
    "I dubbed for some portions of NTR in Ninnu Choodalani," he claims during Mr.Shashank recent interview.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X