»   » గ్యాప్ లేకుండా కష్టపడుతున్న నారా రోహిత్

గ్యాప్ లేకుండా కష్టపడుతున్న నారా రోహిత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తొలిచిత్రం ‘బాణం' నుండి విల‌క్ష‌ణ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యంగ్ హీరో నారా రోహిత్. ‘సోలో, ప్ర‌తినిధి, రౌడీ ఫెలో, అసుర' చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాత‌గా కూడా సినిమాల‌ను నిర్మిస్తూ అందులో కొత్త టెక్నిషియ‌న్స్‌, ద‌ర్శ‌కుల‌ను ఎంక‌రేజ్ చేస్తున్నారు.

నారా రోహిత్ ప్ర‌స్తుతం ‘రాజా చెయ్యివేస్తే', ‘సావిత్రి' సినిమాల చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్‌ను జ‌రుపుకుంటున్నాయి. ‘రాజా చెయ్యివెస్తే' సినిమా నూత‌న ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ ద‌ర్శ‌క‌త్వంలో సాయికొర్ర‌పాటి నిర్మాత‌గా వారాహి చ‌ల‌న‌చిత్రం బ్యాన‌ర్‌పై రూపొందుతుండ‌గా, ‘సావిత్రి' సినిమావిజ‌న్ ఫిలింమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై బి.రాజేంద్ర‌ప్ర‌సాద్ నిర్మాత‌గా ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది.

When Nara Rohit shot for 24 hours non-stop

ఈ రెండు సినిమాలు ఓకే స‌మ‌యంలో జ‌రుగుతుండటంతో నారా రోహిత్ ఉద‌యం ఆరు గంట‌ల నుండి సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు ‘రాజా చెయ్యివేస్తే' చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు. అలాగే సాయంత్రం ఆరు గంట‌ల నుండి మ‌రుసటి రోజు ఉద‌యం ఆరు గంట‌ల‌ వ‌ర‌కు ‘సావిత్రి' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారట. నిద్ర అనే మాటే లేకుండా 24 గంటలు నారా రోహిత్ ఇలా కష్టపడటం చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు.

ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా నారా రోహిత్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటుండ‌టం ఆయ‌న‌కు సినిమా ప‌ట్ల ప్యాష‌న్‌, డేడికేష‌న్‌ను తెలియ‌జేస్తున్నాయని పలువురు కొనియాడుతున్నారు.

English summary
Nara Rohit Involved Without a break in the shooting 24 hours for his upcoming movies Savithri and Raja Cheyi Veste.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu