»   » విషయం పసిగట్టి...ప్రకాష్ రాజ్ త్రిషను తప్పించాడు!

విషయం పసిగట్టి...ప్రకాష్ రాజ్ త్రిషను తప్పించాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ త్రిష సినిమాల్లో తప్ప....ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అసలు కనిపించనే కనిపించదు. ముఖ్యంగా మీడియా ముందుకు అసలు రానే రాదు. ముఖ్యంగా తెలుగు సినిమాల విషయంలో ఆమె ఇలాంటి వాటిని తప్పకుండా పాటిస్తూ ఉంటుంది. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఈ మధ్య కాలంలో మాత్రం త్రిష హైదరాబాద్ లో జరుగుతున్న తన సినిమాలకు సంబంధించిన ఈవెంట్లకు మాత్రం హాజరవుతోంది.

ఇటీవల కమల్ హాసన్ ‘చీకటి రాజ్యం' ప్రెస్ మీట్ కు హాజరైన త్రిష.....మీడియా అడిగే ప్రశ్నల నుండి తప్పించుకునేందుకు అక్కడి నుండి వెంటనే వెళ్లి పోయింది. మీడియాకు చిక్కకుండా ఆమెను అక్కడి నుండి తప్పించింది ఎవరో తెలుసా? ఇంకెవరు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్.

When Prakash Raj Came To Trisha's Rescue

ఇటీవల త్రిష ఎంగేజ్మెంట్ వరుణ్ మణియన్ తో జరుడం, కొన్ని విభేదాల కారణంగా ఇద్దరూ ఎంగేజ్మెంట్ కూడా రద్దు చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా వారు ఎప్పుడు ఆమెను ఈ విషయమై ప్రశ్నిద్దామా? సరికొత్త విషయాలు రాబడదామా? అంటూ కాచుకుని కూర్చున్నారు.

విషయం గ్రహించిన ప్రకాష్ రాజ్..... త్రిష ఇబ్బంది పడకుండా, మీడియా వారు ఆమెను రౌండప్ చేయక ముందు ఆమెను అక్కడి నుండి తప్పించడంలో హెల్ప్ చేసాడు. ప్రకాష్ రాజ్, త్రిష మధ్య మంచి స్నేహం ఉంది. ఆమెకు సంబంధించిన విషయాలు అన్నీ తెలిసిన ప్రకాష్ రాజ్ చాలా తెలివిగా పని పూర్తి చేసాడు.

English summary
It is known that Trisha doesn't really promote her films and rarely appear before media, especially in Telugu film promotions and press meets. But to the shock of everyone, these days Trisha has atleast been attending her film events in Hyderabad.
Please Wait while comments are loading...