»   » ఆమె వీపుని తాకలేక పిడికిళ్ళు బిగించాడు: సల్మాన్ ఖాన్, సనాఖాన్ ఒక హగ్ (వీడియో)

ఆమె వీపుని తాకలేక పిడికిళ్ళు బిగించాడు: సల్మాన్ ఖాన్, సనాఖాన్ ఒక హగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

సనాఖాన్‌ గుర్తుందా తెలుగులో కళ్యాణ్‌రామ్‌ సరసన 'కత్తి' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆమే సనాఖాన్‌. బిగ్‌బాస్‌ రియాల్టీ షో పేరు చెప్పి సల్మాన్‌ఖాన్‌కి దగ్గరయ్యిందీమె. ఎంత దగ్గరయ్యిందంటే, సల్మాన్‌ఖాన్‌ పుట్టినరోజున ప్రత్యేకంగా సల్మాన్‌కి ట్రీట్‌ ఇచ్చిందట సనాఖాన్‌.

తెగ సిగ్గుపడుతుంటాడు

తెగ సిగ్గుపడుతుంటాడు

సల్మాన్‌ ఖాన్‌కు స్వతహాగా కొంచెం సిగ్గెక్కువని అంటుంటారు. అవార్డు ఫంక్షన్లు, అనేక ఈవెంట్లకు హాజరైనప్పుడు అందరితో సరదాగా ఉంటూ కలిసి పోయే సల్మాన్‌ హీరోయిన్లతో మాట్లాడాలంటే మాత్రం మొహమాట పడుతుంటాడని.. తెగ సిగ్గుపడుతుంటాడని బాలీవుడ్‌లో తరచూ విన్పిస్తుంటుంది. తాజాగా దీన్ని నిరూపిస్తూ ఇటీవల ఓ ఘటన జరిగింది.

బిత్తరపోయాడు

బిత్తరపోయాడు

బిగ్ బాస్ -6 లో కంటెస్ట్‌గా ఉన్న సనాఖాన్ ముంబైలో జరిగిన బిగ్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డుల ఫంక్షన్‌లో రెడ్ కార్పెట్ మీద హల్‌చల్ చేసింది. ఈ నేపధ్యంలో ఆమె సల్మాన్‌ను కలుసుకోవాల్సిన ఘట్టం వచ్చింది. సల్మాన్... సనాను దగ్గరకు తీసుకునేందుకు ముందుకు వచ్చాడు. అయితే ఆమె స్టయిల్‌కు బిత్తరపోయాడు సల్మాన్..

పిడికిళ్లను బంధించాడు

పిడికిళ్లను బంధించాడు

ఆమెను ఆలింగనం చేసుకున్నప్పటికీ... ఆ సమయంలో తన పిడికిళ్లను బంధించాడు. సల్మాన్ ఎందుకు ఇలా బిత్తర పోయాడంటే. సనాఖాన్ ఈ ఈవెంట్ కోసం డిజైనర్ నికితా టండన్ రూపొందించిన బ్లాక్ అండ్ వైట్ సెమీ శారీలో బ్యాక్‌లెస్ డ్రెస్ ధరించింది. ఈ కారణంగానే సల్మాన్.. ఆమెను ఆలింగనం చేసుకునే సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ, తన పిడికిళ్లను గట్టిగా బిగించాడు.

టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ

2014లో విడుదలైన సల్మాన్‌ఖాన్‌ ‘జయహో' చిత్రంలో బాలీవుడ్‌ నటి సనాఖాన్‌ నటించింది. సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్‌' 6వ సీజన్‌లోనూ పాల్గొంది. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. సల్మాన్ తన ‘టైగర్ జిందా' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. సనాఖాన్... అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ'లో నటిస్తోంది.

English summary
Salman Khan hugs Bigg Boss fame Sana Khan but his shy smile and closed fists speak a different story
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu