»   » గూగుల్‌ సెర్చ్ 2016 ‌: టాప్ హీరో అల్లు అర్జున్ లేక ఎన్టీఆర్ ..ఏంటి కన్ఫూజన్?

గూగుల్‌ సెర్చ్ 2016 ‌: టాప్ హీరో అల్లు అర్జున్ లేక ఎన్టీఆర్ ..ఏంటి కన్ఫూజన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇంటర్నెట్ అంటే ముందుగా గుర్తొచ్చేది గూగుల్ సెర్చ్ ఇంజన్. గత కొన్నేళ్లుగా గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఏ సినిమా స్టార్ ఎక్కువ సెర్చ్ చేయబడ్డాడనే విషయంలో కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఎప్పటి లానే ఈ సంవత్సరం కూడా గూగుల్ ఎక్కువ సెర్చ్ చేయబడ్డ సెలబ్రిటీల లిస్టు విడుదల చేసింది. అయితే తెలుగు హీరోల్లో ఎక్కువ సెర్చ్ చేయబడిన వారి విషయం మాత్రం ఇప్పుడు కన్ఫూజన్ ఏర్పడింది. కొన్ని వెబ్ సైట్స్ ఎన్టీఆర్ టాప్ అంటూంటే, మరికొందరు అల్లు అర్జున్ టాప్ అని చెప్తున్నారు.

సూపర్ స్టార్ అల్లు అర్జున్ అత్యధికంగా సెర్చ్ చేయబడి నెం.1 స్థానం దక్కించుకున్నారని అంటూంటే , అదేం కాదు ఎన్టీఆర్ ఎక్కువ సెర్చ్ చేసిన సెలబ్రెటీ అని కొందరంటున్నారు. రెండు వెర్షన్ లుగా మీడియాలో స్ప్రెడ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ విషయమై పెద్ద యుద్దమే జరుగుతోంది.

Who is most searched star on Google 2016

ఈ సంవత్సరం సరైనోడు చిత్రం అల్లు అర్జున్ ని ఈ స్దాయికి తీసుకు వచ్చి నెలబెట్టిందని, అలాగే సోషల్ మీడియాలో ఆయనకు ఉన్న క్రేజ్ ఇతర హీరోలను వెనక్కి తోసి మొదటి స్థానం దక్కించుకోవడని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.

మరో ప్రక్క నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్, ఎన్టీఆర్ వరస హిట్స్ తో గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చూసారంటా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. మిగతా హీరోల అభిమానులు తమ హీరో టాప్ లో లేకపోవటం ఏమిటిని వాళ్లు వాదించుకుంటున్నారు. ఇలా చాలా కన్ఫూజెడ్ గా వ్యవహారం నడుస్తోంది. ఈ విషయమై గూగుల్ ఇండియా వారే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

English summary
Here's a new war erupting between fans of Allu Arjun and NTR over the most googled Telugu actor in 2016. As the battle of words continue between the fans of both the stars over most googled Telugu actor in 2016, people and netizens are puzzled over the claims of both the stars' fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu