For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2014: ఈ తెలుగు హీరోల్లో బెస్ట్ ఎవరూ..?? (ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : 2014 చివరకు వచ్చేసింది. హిట్ లు ప్లాపులుతో ఎప్పటిలాగే మరో సంవత్సరంలోకి ప్రయాణం పెట్టుకుంది. ఈ సంవత్సరం దాదాపు 200 తెలుగు సినిమాలు దాకా విడుదల అయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ సంవత్సరం మంచి ఫెరఫార్మెన్స్ చూపిన హీరో ఎవరూ అనేది ఓ సారి పరిశీలిద్దాం.

  నిజానికి స్టార్స్ వేరు, నటులు వేరు అన్నది తొలి నాటి నుంచి పరిశ్రమలో వినపడుతున్న మాటే. అయితే స్టార్స్ కూడా ఫెరఫార్మెన్స్ వైజ్ ఆకట్టుకునే నటన చూపకపోతే వారు స్టార్స్ కాలేరు. అద్బుతం చేయకపోయినా ఆకట్టుకునే నటన చేయటమనేది స్టార్ హీరోలకు అవసరం.

  అలాగే తమ ఫెరఫార్మెన్స్ చూపెదామన్నా దానికి తగ్గ కథలు తమ దగ్గరకు రావని, ఇమేజ్ చట్రంలో బిగుసుకుపోయిన తాము అభిమానులు కోసం నటనకు అంతగా అవకాసం లేదని, హీరోయిజం ఎలివేట్ చేసే కథలనే ఎంచుకోవాల్సి వస్తుందని వాపోతూంటారు.

  2014లో వచ్చిన చిత్రాల్లో మన హీరోలు ప్రదర్శించిన ఫెరఫార్మెన్స్ ఓ సారి చూద్దాం.

  నేనొక్కిడినే...

  నేనొక్కిడినే...

  సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ...1 నేనొక్కిడినే చిత్రంలో ప్రిన్స్ మహేష్ అద్బుతమైన ఫెరఫార్మెన్స్ ఇచ్చారని అందరూ మెచ్చుకున్నారు. ఆయన తన వర్క్ లో డెడికేటెడ్ గా ఉండటమే ఈ స్ధాయి పేరు రావటానికి కారణం అని అందరికీ తెలిసిందే. ఆయనే కాకుండా ఇంకా చాలా మంది హీరోలు తమ దైన శైలిలో తామేంటో చూపారు.

  మనం

  మనం

  అక్కినేని హీరోలంతా చేసిన మనం చిత్రంలో నాగార్జున ఉత్తమమైన నటన చూపారని అందరూ మెచ్చుకున్నారు. ఆయన తన కుమారుడు నాగ చైతన్య కన్నా కూడా అద్బుతం చేసారని అంతటా వినిపించింది.

  గోవిందుడు అందరి వాడేలే

  గోవిందుడు అందరి వాడేలే

  చిత్రం అనుకున్న రీతిలో విజయం సాధించ లేకపోయినా రామ్ చరణ్ ఫెరఫార్మెన్స్ కు మాత్రం మంచి పేరు తెచ్చి పెట్టిన చిత్రం ఇది.

  రభస

  రభస

  ఎన్టీఆర్ కు మరో ఫ్లాఫ్ గా మిగిలిన ఈ చిత్రం సైతం ఎన్టీఆర్ లోని ఎంటర్టైన్మెంట్ ఏంగిల్ ని పూర్తిగా వినియోగించుకుంటూ వచ్చింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటనకి మంచి మార్కులే పడ్డాయి.

  లెజండ్

  లెజండ్

  బాలకృష్ణ ద్వి పాత్రాభినయం చేసిన ఈ చిత్రం ఆయన గత చిత్రం సింహాలా రికార్డు రేంజిలో ఆడింది. అలాగే లెజండ్ గా ఆయన నటన మరువలేనిదని ఆయన అభిమానులు అంటూంటారు.

  అల్లు అర్జున్

  అల్లు అర్జున్

  ఎవడు, రేసు గుర్రం చిత్రాల్లో నటించిన అల్లు అర్జున్ ...భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో రేసు గుర్రంలా నిలిచారు. అలాగే ప్రక్కింటి కుర్రాడుగా ఆయన నటన మంచి మార్కులే వేయించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో పోలీస్ గా అదరకొట్టారు.

  పవర్

  పవర్

  రవితేజ మార్కుని పూర్తిగా వినియోగించుకుంటూ వచ్చిన చిత్రం పవర్. పాటలు,ఫైట్స్, డైలాగు డెలివరి అన్ని తన దైన శైలిని ద్విగుణీకృతం చేస్తూ వచ్చిన ఈ చిత్రంలో రవితేజ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

  దృశ్యం

  దృశ్యం

  భాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచి వెంకటేష్ కు మళ్లీ పునర్జన్మ ఇచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్ తన ఇమేజ్ ని వదలిపెట్టి చేసిన నటన అందరి మన్ననలూ పొందింది.

  నాగ చైతన్య

  నాగ చైతన్య

  ఒక లైలా కోసం అంటూ వచ్చిన నాగ చైతన్య పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ...నటుడుగా బాగా చేసాడని అందరిచేతా ప్రసంశలు అందుకున్నాడు.

  పిల్లా నువ్వు లేని జీవితం

  పిల్లా నువ్వు లేని జీవితం

  కొత్త కుర్రాడు అయినా కుమ్మేసాడు అనే పేరు తెచ్చి పెట్టన చిత్రం ఇది. లాంచింగ్ కు ఫెరఫెక్ట్ చిత్రంగా నిలిచిన ఈ చిత్రం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ కు మంచి ప్రారంభాన్ని ఇచ్చింది. నటుడుగానూ మంచి పేరే తెచ్చి పెట్టింది.

  హార్ట్ ఎటాక్

  హార్ట్ ఎటాక్

  నితిన్,పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద బాగానే వర్కవుట్ అయ్యింది. అలాగే నితిన్ ...యూత్ పల్స్ ని మరోసారి పట్టుకున్నాడని అనిపించింది

  లౌక్యం

  లౌక్యం

  సక్సెస్ లేక విలవిల్లాడుతున్న గోపిచంద్ కు లౌక్యం చిత్రం మంచి సక్సెస్ నే ఇచ్చింది. అలాగే గోపిచంద్ యాక్షన్ ఇమేజ్ నుంచి ఎంటర్టైన్మెంట్ మార్క్ వైపు నడిపించిన ఈ చిత్రంలో తన పాత్రకు బాగా న్యాయం చేసాడు.

  రన్ రాజా రన్

  రన్ రాజా రన్

  ఎప్పుడూ సీరియస్ రోల్స్ చేసే శర్వానంద్ తొలిసారిగా పూర్తి ఎంటర్టైన్మెంట్ తో చెలరేగిపోయాడు. తనలోని నటుడుని మరోసారి నిద్రలేపిన ఈ చిత్రం శర్వా అభిమానులకు మంచి కానుక.

  ప్రతినిధి

  ప్రతినిధి

  ఎలక్షన్స్ ముందు వచ్చిన నారా రోహిత్ చిత్రం ప్రతినిథి. ఈ చిత్రం నారారోహిత్ లోని మంచి నటుడుని మన ముందు మరోమారు ఆవిష్కరించింది.

  కార్తికేయ

  కార్తికేయ

  స్లోగా పికప్ అయ్యి ..స్టడీగా ఉన్న కార్తికేయ చిత్రం...నిఖిల్ లోని మారిన నటుడుని చూపెడుతుంది. లైటర్ వీన్ పాత్రలు చేసే నిఖిల్..పూర్తిగా ...తనను తాను మార్చుకుని చేసిన ఈ థ్రిల్లర్ మంచి పేరు తెచ్చిపెట్టింది.

  English summary
  The year 2014 has come to an end. Telugu film industry will soon cross the magical mark of 200 Telugu films released in the year, 2014. Let's have look at a list of actors who have performed well in 2014.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X