»   » షాకింగ్: శత్రువులకు పిండం పెట్టిన.. కమిడయన్ ధర్టీ ఇయిర్స్ ఫృధ్వీ

షాకింగ్: శత్రువులకు పిండం పెట్టిన.. కమిడయన్ ధర్టీ ఇయిర్స్ ఫృధ్వీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :తన దైన శైలిలో డైలాగులు చెప్తూ...వరస పెట్టి హిట్లు కొడుతూ..రోజు రోజుకూ డిమాండ్ పెంచుకుంటున్న కమెడియన్ థర్టీ ఇయర్స్ పృధ్వీ. ఈయన తాజాగా పేస్ బుక్ లో ఓ షాకింగ్ పోస్ట్ పెట్టి షాక్ ఇచ్చారు.

పెళ్లి చేసుకుని మోసం చేసాడంటూ కమెడియన్ ఫృధ్వీపై పోలీస్ కేసు

తన తల్లి తండ్రులతో పాటు తన శత్రువులకు కూడా పిండాలు పెడుతున్నట్లు కొన్ని ఫోటోలను పేస్ బుక్ లో పోస్ట్ చేసారు. తల్లి తండ్రులకు పిండ ప్రధానం చేయడం అందరూ చేసేది. అయితే తన శ్రువులకు కూడా పిండాలు పెడుతున్నాని ఫృధ్వీ చెప్పడం ఇండస్ట్రీ కు షాక్ ఇచ్చింది. ఇదేదో షూటింగ్ లో సీన్ అనుకునేరు. నిజంగానే పిండాలు పెట్టాడు ఫృద్వి. మీరే చూడండి. ఆ పోస్ట్ ని.

బాయిలింగ్ స్టార్ బబ్లు, ఫ్యూచర్ స్టార్ సిద్దప్ప.. మల్లెపుష్పం రామారావు... ఇగో రెడ్డి .. ఇలా వరుస హిట్ పాత్రలలో ప్రేక్షకులను నవ్విస్తున్నారు. ఇక స్పూఫ్ లు సంగతి చెప్పక్కర్లేదు. వరుస హిట్స్ తో జోరుమీదున్న పృథ్వీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక అతడిపై కొంతమంది కుట్ర చేస్తున్నట్లు చెప్తున్నారు.

అలాగే, ఆయనపై కేసులు నమోదవడం కూడా దానిలో భాగమే అని ఇటీవలి కాలంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అలాగే తనతో సహజీవనం చేసి, ఇప్పుడు తనను వెళ్లగొడుతున్నాడంటూ ఒక మహిళ పృథ్వీపై కేసు పెట్టడం కూడా దీనిలో భాగమేనని అంటున్నారు. దీంతో తనకు ఈ శత్రువుల బెడద తగ్గిపోవాలని పిండం పెట్టినట్లు పృథ్వీ తెలిపాడు.

English summary
Comedian Prudhvi Raj aka 30 Years Prudhvi became a star comedian in Tollywood only since the last couple of years. Today, there’s literally no film without Prudhvi. With this phenomenal stardom and fame, came in a lot of conspiracies to sabotage Prudhvi’s rise in Tollywood, admitted by the actor himself in a recent TV interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu