»   » ఇంతకీ కందిరీగ సక్సెస్ క్రెడిట్ ఎవరిది హీరో?విలన్?దర్శకుడు?

ఇంతకీ కందిరీగ సక్సెస్ క్రెడిట్ ఎవరిది హీరో?విలన్?దర్శకుడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'కందిరీగ' సినిమా హిట్టే... నో డౌట్... దీనిని అందరూ ఒప్పుకుంటున్నారు. అయితే, ఆ సక్సెస్ క్రెడిట్ ఎవరికి దక్కుతుందన్న విషయంలోనే వివాదం రేగుతోంది. మామూలుగా, సినిమా హిట్టును ఏ హీరో అయినా సరే, తన అకౌంట్లో వేసేసుకుంటాడు. అలాగే హీరో రామ్ కూడా ఆ సినిమా సక్సెస్ ను తనకు ఆపాదించుకుంటూ ప్రమోషన్ చేసేసుకుంటున్నాడు. అయితే, ఆ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ మాత్రం ఆ సక్సెస్ ను అందులో ముఖ్య పాత్ర పోషించిన సోనూ సూద్ కి అంటగడుతున్నాడు. ఫస్టాఫ్ లో సోనూ చేసిన కామెడీ, సెకండాఫ్ లో అతని అభినయం సినిమాను హిట్ చేశాయని సురేష్ అంటున్నాడు.

రామ్ తో పారితోషికం విషయంలో పేచీ రావడం, రామ్ వెళ్లి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్లో ఫిర్యాదు చేయడం వల్ల, హీరోని నిర్మాత సురేష్ సైడ్ చేసేస్తూ సోనూ సూద్ ని పొగుడుతున్నాడని టాలీవుడ్ లో వినిపిస్తోంది. పైగా, సోనూ సూద్ ని హీరోగా పెట్టి సినిమా తీస్తానని సురేష్ ప్రకటించడం కూడా, రామ్ ఇమేజ్ ని తగ్గించడానికేనని అంటున్నారు. ఏమైనా, ఈ సక్సెస్ కు అసలు కారకుడైన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ని మాత్రం ఇద్దరూ మరచిపోతున్నారు!

English summary
Sonu Sood's role as comedy villain in Kandireega was well-appreciated by the audience and the actor played the key role in film’s success. In Tollywood, Sonu Sood has films like Super, Athadu, Arundhati, Anjaneyulu, Ek Niranjan, Kandireega etc to his credit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu