»   » రమ్య తర్వాత ఊపేసేదెవరు? (పిక్చర్స్)

రమ్య తర్వాత ఊపేసేదెవరు? (పిక్చర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటి, మాండ్య పార్లమెంటు సభ్యురాలు రమ్య నటనకు గుడ్ బై చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజకీయాలకు, నటనకు ఒకే సమయంలో న్యాయం చేయలేనని ఆమె భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఉప ఎన్నికల్లో మాండ్య లోకసభ నుండి కాంగ్రెసు తరఫున గెలిచిన రమ్య.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోను పోటీ చేయనున్నారు.

ఆమె దాదాపుగా నటనకు గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయి. ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. నటనకు, రాజకీయాలకు న్యాయం చేయలేకపోతున్నట్లు వాపోయారు.

రమ్య

రమ్య

ఎన్నికల దృష్ట్యా ఆమె అలా వ్యాఖ్యానించి ఉండవచ్చునని, ప్రస్తుతానికి అలా చెప్పినా, ఎన్నికల తర్వాత మళ్లీ నటించే అవకాశాలు లేకపోలేదని కొందరు అంటున్నారు. ఆమె నటనకు స్వస్తీ చెప్పకపోయినప్పటికీ... రాజకీయాల్లో ఉన్నందున కొంత ఊపు తగ్గే అవకాశముంది. దీంతో ఇక కన్నడలో రమ్య తర్వాత ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తోంది.

రాధికా పండిట్

రాధికా పండిట్

మంగళూరుకు చెందిన రాధికా పండిట్ రేసులో ఉన్నారు. మొగ్గినా మనసు చిత్రం తర్వాత శాండిల్ వుడ్‌లో ఆమెకు గిరాకీ బాగా పెరిగింది.

రాగిని ద్వివేది

రాగిని ద్వివేది

బెంగళూరుకు చెందిన రాగిణి ద్వివేది కన్నడతో పాటు బాలీవుడ్ చిత్రాల్లో ఐటం సాంగ్సుల్లో నటించింది. ఈమె పలువురు కన్నడ సూపర్ స్టార్స్‌తో కలిసి విజయవంతమైన చిత్రాల్లో నటించింది.

ఐంద్రిత రాయ్

ఐంద్రిత రాయ్

పారిజాత గర్ల్ ఐంద్రిత రాయ్ శాండిల్ వుడ్‌లో విజయవంత హీరోయిన్లలో ఒకరు. ఈమె సూపర్ స్టార్స్‌తో పాటు, కొత్తగా వచ్చిన టాలెంటెడ్ నటులతో కలిసి నటించింది.

అమూల్య

అమూల్య

అమూల్య రెండు చిత్రాల్లో ఫిమేల్ లీడ్ చిత్రాల్లో నటించిది. ఆ తర్వాత నటుడు గణేష్‌తో కలిసి శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో కథానాయికగా నటించింది.

సంజన

సంజన

సంజన గల్రానీ పలు ఫిమేల్ లీడ్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రల్లో నటించింది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా ఉంది.

హర్షిక

హర్షిక

హర్షిక పూనంచ కన్నడ సినిమాల్లో బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు. ఈమె తమస్సు చిత్రానికి గాను బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ (ఫిమేల్) అవార్డును దక్కించుకున్నారు.

దీపా సన్నిది

దీపా సన్నిది

దీపా సన్నిది వరుసగా హిట్స్ కొడుతోంది. ఆమె నటించిన పరమాత్మ, సారథి తదితర చిత్రాలు వరుసగా విజయం సాధించాయి. దీంతో రమ్య తర్వాత ఈ బెంగళూరు బ్యూటీ కూడా రేసులో ఉన్నది.

 ప్రణీత

ప్రణీత

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంలో ప్రణీత కనిపించారు. అంతకుముందు కూడా కనిపించారు. కన్నడలోను ఆమె ఇప్పుడు రేసులో ఉన్నారు.

పారుల్ యాదవ్

పారుల్ యాదవ్

పారుల్ యాదవ్ ఒక్క చిత్రంతోనే శాండిల్ వుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయారు. సోలో హీరోయిన్‌గా ఆమె నటించిన శివాజినగర చిత్రం ఘన విజయం సాధించింది. ఇదే ఆమె తొలి చిత్రం.

కృతి కర్బంద

కృతి కర్బంద

కృతి కర్బంద కూడా రేసులో ఉన్నారు. కన్నడ నిర్మాతలకు కృతి కర్బంధ వాంటెడ్ హీరోయిన్ అయిపోయారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

రచితా రామ్

రచితా రామ్

చాలెంచింగ్ స్టార్ దర్శన్‌తో నటించిన రచితా రామ్ లక్కీగా మరో రెండు సూపర్ స్టార్స్ సినిమాలలో అవకాశం కొట్టేసింది. దర్శన్ హీరోగా వచ్చిన బుల్ బుల్ చిత్రంలో ఆమె నటించింది.

English summary
It's a known fact that Kannada actress and politician Ramya has finally said good bye for her filmdom, and decided to become full time politician. The actress, who won over congress ticket from Mandya Lok Sabha constituency is all set to try her luck for the second time by contesting in the upcoming polls.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu