»   »  వర్మ 'రక్త చరిత్ర'లో హీరో ఎవరంటే..

వర్మ 'రక్త చరిత్ర'లో హీరో ఎవరంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram Gopal Varma
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దివంగత పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తాజాగా తలపెట్టిన 'రక్త చరిత్ర' సినిమాను రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎవరు హీరోలుగా చేయబోతున్నారనే విషయం అంతటా చర్చనీయంగా మారింది. అయితే ప్రధాన పాత్రలయిన పరిటాల రవి,మద్దెల సూరి పాత్రల కోసం చాలా మందిని పరిశీలించిన మీదట ఆయన సర్కార్ రాజ్ సినిమాలో చేసిన రవికాలేకర్,దిలీప్ ప్రభాకవల్ కర్ లను ఎంపిక చేయనున్నారన్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రకు చెందిన వీరిద్దరూ స్టేజీ ఆర్టిస్టులు కావటంతో పాత్రల్లో ఈజీగా పరకాయ ప్రవేశం చేయగలరని ఆయన భావిస్తున్నారని సమాచారం. అయితే ఎవరిని ఏ పాత్రకు అనేది మాత్ర తెలియరావటం లేదు. మరో ప్రక్క ఇంకేమన్నా బెటర్ ఆప్షన్ దొరకుతుందేమన్నేమో మరికొంతమందికి ఫోటో సెషన్ జరుపుతున్నారని చెప్తున్నారు. ఇకు ఈ సినిమా రీసెర్చి కోసం ఆయన మొన్నట నుండీ ఫ్యాక్షన్ గ్రామాలను పరిశీలించటం,ఆ వ్యక్తులను కలవటం చేస్తున్నాడు. ఆ క్రమంలో క్రితం శనివారం మద్దెల చెర్వు సూరిని అనంతపురం జైలు కెళ్ళి కలిసారు. అనంతరం మద్దలచెరువు గ్రామానికెళ్లి సూరి కుటుంబ సభ్యులను కలుసుకుని వారి కుటుంబీకుల సమాధులను సందర్శించారు. వారింట భోజనం చేసి తన కథకు కావాల్సిన మరిన్ని విషయాల్ని వారి నుంచి సేకరించారు.మద్దలచెరువు గ్రామ ప్రజలతోనూ వర్మ ముచ్చటించారు.

ఆదివారం వెంకటాపురం వెళ్ళి పరిటాల సునీతని,వారి బంధు వర్గాన్ని కలిసారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ మద్దెల చెర్వు సూర్యానారాయణ రెడ్డితో పాటు పరిటాల రవి సతీమణి, శాసనసభ్యురాలు పరిటాల సునీత సినిమా తీయడానికి అంగీకరించినట్లు ఆయన తెలిపారు. అలాగే..తన సినిమా ఎవరినీ బలపరిచేదిగా ఉండదని, సందేశాత్మకంగా ఉంటుందని ఆయన చెప్పారు. తన రక్తచరిత్ర సినిమాకు మద్దెలచెర్వు సూరి పెట్టుబడి పెడుతున్నారనే వార్తలను ఆయన ఖండించారు. సినిమా మొత్తం రాయలసీమ జిల్లాల్లోనే షూటింగ్ జరుపుకుంటుందని ఆయన చెప్పారు. నవంబర్ 20వ తేదీ నుంచి షూటింగ్ జరుపుతామని ఆయన చెప్పారు. ఇక ఈ చిత్రానికి ధర్మ రక్ష అనే కవలలు దర్శకత్వం చేయనున్నారు. వారు వియన్ ఆదిత్య,యమ్.ఎస్.రాజు ల వద్ద పనిచేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X