సంక్రాంతికి విడుదలైన 'వినయ విధేయ రామ' సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడడం, ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు దాదాపు 30 కోట్ల మేర నష్టపోవడం తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ల నష్టాలకు పరిహారం చెల్లించాలని హీరో రామ్ చరణ్, నిర్మాత దానయ్య నిర్ణయిచడం, బోయపాటి తన రెమ్యూనరేషన్ నుంచి డబ్బు తిరిగి ఇవ్వడానికి ససేమిరా అనడంతో వివాదం మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బోయపాటి తీరు మెగా క్యాంపుకు ఆగ్రహం తెప్పించిందని, ఆయనకు ఇకపై మెగా క్యాంపస్‌లో అడుగు పెట్టే అవకాశం ఉండక పోవచ్చని, దాదాపుగా దారులు మూసుకుపోయినట్లే అనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.
బాలయ్య నుంచి బోయపాటికి సపోర్ట్
‘వినయ విధేయ రామ' ప్లాప్ అయినప్పటికీ బోయపాటికి బాలయ్య నుంచి ఫుల్ సపోర్ట్ లభించినట్లు తెలుస్తోంది. వారి కాంబినేషన్లో త్వరలో రాబోయే సినిమా టాలీవుడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
నేనున్నానంటూ బాలయ్య హామీ
బాలయ్యతో చేయబోయే సినిమాకు సంబంధించి బోయపాటి ఆల్రెడీ స్క్రిప్టు కూడా వినిపించారని, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. నీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పు నేను డీల్ చేస్తానంటూ బాలయ్య హామీ ఇచ్చారట.
‘లెజెండ్' తర్వాత బోయపాటికి ఇప్పటి వరకు మంచి విజయం పడలేదనే చెప్పాలి. ‘సరైనోడు' హిట్ టాక్ వచ్చినా లాభాలు తేలేదని, అయితే లాభాలు వచ్చినట్లు అప్పుడు మెగా క్యాంప్ కవర్ చేసిందని, అలా కవర్ చేసి ఉండక పోతే ‘వినయ విధేయ రామ' వరకు పరిస్థితి వచ్చి ఉండేది కాదు అనేది కొందరి వాదన.
బాలయ్య-బోయపాటి మూవీ ఎవరు నిర్మిస్తారు?
సరైన హిట్టు లేని బోయపాటితో సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చే నిర్మాత ఎవరు? అనేది హాట్ టాపిక్ అయింది. దీన్ని బాలయ్యే తన సొంత బేనర్ ‘ఎన్‌బికె ఫిల్మ్స్' పతాకంపై నిర్మిస్తారా? లేక బయటి ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారా అనేది తెలియాల్సి ఉంది.
After Vinaya Vidheya Rama, Boyapati all set to his next film with Balakrishna. Boyapati has already narrated a plot line to Balakrishna and has got nod. It is not clear whether Balakrishna will produce this film or not.
Story first published: Tuesday, February 12, 2019, 8:36 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more