twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎక్సక్లూజివ్: అమీర్ ఖాన్ అతి పెద్ద సాహసం, మెచ్చుకోకుండా ఉండలేరు

    By Srikanya
    |

    ముంబై: మిస్టర్ ఫెరఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్..త్వరలో ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మలా కనిపించనున్నారా అంటే అవుననే వినపడుతోంది. ఆయన తన సినీ కెరీర్ అతి పెద్ద సాహసం రాకేష్ శర్మ జీవిత చరిత్ర సినిమాతో చేయబోతున్నట్లు చెప్తున్నారు. ఇదే గనుక నిజమైతే అదే తొలి బాలీవుడ్ స్పేస్ మూవి అవుతుందనటంతో సందేహం లేదు.

    రాకేష్ శర్మ విషయానికి వస్తే అంతరక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి ఆయన. 1984 ఏప్రియల్ 3న రష్యాకు చెందిన సోయజ్ టి-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి , బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి వెళ్లాడు. అంతరిక్షంలోకి వెళ్లిన ప్రపంచపు వ్యోమగాములల్లో రాకేష్ శర్మ..138 వ వాడు.

    ఈ ప్రయాణంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ..రాకేష్ శర్మను అక్కడనుంచి భారతదేశం నుంచి ఎలా కనిపిస్తుందని అడిగిన ప్రశ్నకు..రాకేష్ శర్మ...సారే జహాసే అచ్చా..హిందూస్తా హమారా అని చెప్పి దేశభక్తిని చాటి చెప్పారు.

    అమీర్ ఖాన్ ఇప్పుడు ఆనాటి గోల్డెన్ మెమెరీస్ ని వెండితెరపై చూపనున్నాడు. ఆస్కార్ ను సైతం ఈ సినిమా టార్గెట్ చేస్తుందని చెప్తున్నారు. ఓ ప్రక్కన బాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఖచ్చితంగా సినిమా ప్రియులను అలరిస్తుందని చెప్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఎవరు డైరక్ట్ చేయబోతున్నారు,ఎవరు నిర్మిస్తారు, బడ్జెట్ ఎంత అనే విషయాలు మాత్రం ఇంకా బయిటకు రాలేదు.

    స్లైడ్ షోలో..మిగతా విశేషాలు..

    వాళ్లే ఆస్ట్రోనాట్ లు

    వాళ్లే ఆస్ట్రోనాట్ లు

    భూగ్రహాన్ని విడిచి.. అంతరిక్షంలోకి వెళ్లి విశ్వరహస్యాలు తెలియచెప్పే వాళ్ళే ‘ఆస్ట్రోనాట్‌'లు.

    పేరు తెచ్చారు

    పేరు తెచ్చారు

    మనదేశానికి చెందిన రాకేష్ శర్మ... అంతరిక్ష పరిశోధనతో మన దేశానికి ఎంతో పేరును తీసుకు వచ్చారు.

    వైమానిక దళంలో..

    వైమానిక దళంలో..

    1954లో పాటియాలాలో జన్మించిన ఆయన భారత వైమానిక దళంలో చేరారు. తన టాలెంట్ తో స్పీడుగా ప్రమోషన్స్ పొందారు.

    ఎనిమిదిరోజులు పాటు

    ఎనిమిదిరోజులు పాటు

    భారత అంతరిక్ష పరిశోధన సంస్ద, సోవియట్ స్పేస్ పోగ్రామ్ సమన్వయ కార్యక్రమమైన ఈ యాత్ర సాల్యూట్ 7 రోదశీ స్టేషన్ లో ఎనిమిది రోజులు పాటు సాగింది.

    ప్రయాణ సమయంలో

    ప్రయాణ సమయంలో

    ప్రయాణ సమయంలో రాకేష్ శర్మ..హిమాలయాల్లో జలవిద్యుత్ శక్తి ప్రాజెక్టులపై ఫొటోలు తీసారు.

    English summary
    Now Aamir Khan, would bring back the golden memories of Indian space accomplishments and is all set to take a giant leap in Bollywood cinema. Aamir will play Rakesh Sharma in his next film. He is all set to move from playing a pehalwan to now going out to the space."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X