For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తెలుగులోనూ అదురుతోంది: రాజుకుంటున్న మెర్సల్ వివాదం, సాయంత్రం కల్లా "బీప్" క్లారిటీ

  |

  తెలుగులో మార్కెట్‌ పెంచుకోవాలని విజయ్‌ చాన్నాళ్ళుగా ప్రయట్నిస్తున్నాడు. రజనీకాంత్‌, సూర్య, కార్తీ.. ఇలా తమిళ స్టార్‌ హీరోలే కాదు, కొత్తగా తమిళ సినీ రంగంలోకి వచ్చినవారు కూడా తెలుగు సినిమా మార్కెట్‌పై ఫోకస్‌ పెట్టి, సక్సెస్‌ అవుతున్న విషయం విదితమే. పాపం విజయ్‌.. ఏం చేసినా, తెలుగు మార్కెట్‌పై పట్టు సాధించలేకపోతున్నాడు. అయితే ఈ సారి వచ్చిన మెర్సల్ తెలుగు వెర్షన్ "అదిరింది" గనక సరైన టైమ్ లో వచ్చి ఉంటే విజయ్ కోరిక నెరవేరేదే కానీ వివాదం ఈ సారి "దేశద్రోహం" అన్న రేంజి లో ఫోకస్ అయ్యే సరికి తెలుగు విడుదలకు సమస్యలు ఏర్పడ్దాయి...

  Mersal Movie Review : మెర్సల్ మూవీ రివ్యూ
   తొలగిస్తేనే సర్టిఫికెట్

  తొలగిస్తేనే సర్టిఫికెట్

  ఈ సినిమాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని, వాటిని తొలగిస్తేనే.. సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ సభ్యులు చెప్పడం, అందుకు చిత్ర యూనిట్ వ్యతిరేకించడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. నిజానికి జీఎస్టీ మీద ఉన్న వ్యాఖ్యల వలననే వివాదం మొదలైనా తమిళ మెర్సల్ కి అంచనాలను మించిన విజయానికి కారణం ఆ వివాదమే.

   సంచలనాలు సృష్టిస్తోంది

  సంచలనాలు సృష్టిస్తోంది

  లేదంటే హిట్ అయినా మరీ ఇంత ఆసక్తి ఉండేది కాదు. ఆ వివాదం వల్ల రెట్టింపు హైప్ తెచ్చుకుంది మెర్సల్. తమిళంలో ఈ సినిమా సంచలనాలే సృష్టిస్తోంది. రికార్డులు కొల్లగొట్టేస్తోంది. రికార్డులే కాదు, వివాదాలూ సినిమాని వార్తల్లో వుంచుతుండడం గమనార్హమిక్కడ.

  తెలుగులో 'అదిరింది'

  తెలుగులో 'అదిరింది'

  దేశమంతా ఇప్పుడు 'మెర్సల్‌' సినిమా గురించే మాట్లాడుకుంటోంది. ఆ సినిమా తెలుగులో 'అదిరింది'గా విడుదవ్వాల్సి వుంది. విడుదలై వుంటే, ఇక్కడా సినిమా మంచి విజయాన్నే దక్కించుకుని వుండేది. కానీ ఆ వివాదాన్ని దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు తెలుగు వెర్షన్ రిలీజ్ కి అడ్డు పడుతోంది సెన్సార్ బోర్డ్.

  బిజినెస్‌గా మారిన వైద్య వృతిపై

  బిజినెస్‌గా మారిన వైద్య వృతిపై

  సేవ కోసం కాకుండా పక్కా బిజినెస్‌గా మారిన వైద్య వృతిపై దర్శకుడు సంధించిన సినీ విమర్శనాస్త్రం మెర్సల్ చిత్రం. వైద్య రంగంలో జరిగే కమీషన్ల దందా, ప్రైవేట్ హాస్పిటల్స్ దందాను దర్శకుడు అట్లీ కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఈ రకమైన కథకు హృదయాన్ని పిండి వేసే సన్నివేశాలను బలంగా రాసుకోన్నాడు.

  డాక్టర్ల మనోభావాలు

  డాక్టర్ల మనోభావాలు

  అయితే అందులో అన్నీ నిజాలే ఉన్నా.., డాక్టర్ల మనోభావాలు కూడా బలంగానే దెబ్బ తిన్నాయి. దాంతో వైధ్య్లూ ఈ సినిమాని వ్యతిరేకిస్తున్నారు. ఇక కేంద్రప్రభుత్వ విధానాలనూ విమర్శించిన తీరు కూడా లాజిక్ తోనే ఉన్నా అధికార పార్టీ నేతలకు మాత్రం అంతగా రుచించలేదు. ఫలితం తమిళ సినిమా, రాజకీయ రంగాలు అట్టుడుకుతున్నాయి.

  వివాదాస్పద సన్ని వేశాలలో

  వివాదాస్పద సన్ని వేశాలలో

  ఇప్పుడు గనక ఆ సినిమాని ఇక్కడ ఏ సెన్సార్ లేకుండా ఇక్కడ విడుదల చేస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే స్థాయి కల్లోలం రేగే పరిస్థితి వస్తుందన్నది సెన్సార్ అభిప్రాయం. అందుకే ఆ వివాదాస్పద సన్ని వేశాలలో వచ్చే డైలాగులను మ్యూట్ చేయాలని కండిషన్ పెట్తారు. కానీ ఆ డైలాగులు గనక లేకపోతే అసలు సినిమాకి అర్థమే ఉండదన్నది, దర్శక, నిర్మాతలతో పాటు సినీ విశ్లేషకుల మాట కూడా...

  జీఎస్టీ వచ్చే సమయంలో

  జీఎస్టీ వచ్చే సమయంలో "బీప్"

  మొత్తానికి అదిరింది విడుదల కోసం ఒక రాష్ట్రాన్నీ, కేంద్రం లో అధికారం లో ఉన్న పార్టీని ని కూడా బెదరగొదుతోంది. అయితే సినిమా విడుదల మరీ ఆలస్యమైతే బాగోదని భావించిన చిత్ర యూనిట్.. జీఎస్టీ గురించి డైలాగ్స్ వచ్చే సమయంలో బీప్ పెట్టే అంశం గురించి చర్చిస్తోందట. అంతా ఓకే అయితే ఇవాళ సాయంత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చే అవకాశముందని సమాచారం.

  English summary
  The release of Kollywood star Vijay's much awaited movie, 'Mersal' telugu version "Adirindi" has been postponed from October 27th Because of controversy dialogues.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X