»   » బాలయ్య సీక్రెట్ రివీల్, వింటనే గ్రేట్ అనిపిస్తుంది

బాలయ్య సీక్రెట్ రివీల్, వింటనే గ్రేట్ అనిపిస్తుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలయ్య చేసిన యాడ్స్ చూసిన వాళ్లు లేరు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ యాడ్స్ చేయలేదు. ఈ విషయమై అందరికీ ఆశ్చర్యమే. నిన్న మొన్న వచ్చిన హీరోలు సైతం యాడ్స్ చేస్తూ సంపాదిస్తూంటే బాలయ్య బాబు మాత్రం మొదటి నుంచీ యాడ్స్ కు దూరంగానే ఉంటూ వచ్చారు. అందుకు స్పెసిఫిక్ కారణం ఏమైనా ఉందా..ఉంది అంటున్నారు బాలకృష్ణ. ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు బాలయ్య.

బాలకృష్ణ మాట్లాడుతూ.. ''ఇది నాన్న గారి నుంచి నేను నేర్చుకున్న లక్షణం. ఆయన ఏనాడూ తన ఇమేజ్‌ను అడ్డం పెట్టుకుని వ్యాపార ప్రకటనల్లో నటించలేదు. కనిపించలేదు. ఐతే కొందరు ఎన్టీఆర్‌ను తమ ఆస్తిగా భావించి సినిమా ఫొటోల్నే తమ ప్రాడెక్ట్స్ మీద వేసుకునేవాళ్లు.

Balayya

అలాగే మనకు ఈ ఇమేజ్ వచ్చింది ప్రేక్షకుల వల్లే. వారి అభిమానాన్ని కాపాడుకోవడానికి వారు మెచ్చే సినిమాలతోనే వారికి ఆనందాన్ని కలిగించాలి. అంతే తప్ప వాళ్లిచ్చిన ఇమేజ్‌ను మన స్వార్థం కోసం సొమ్ము చేసుకోకూడదన్నది ఆయన చెప్పేవారు.

ఇక తన తండ్రి నుంచి ఆయన ఆ మాటలను తీసుకున్నానని చెప్తున్నారు. బాలయ్య అదే విషయం చెప్తూ... నాన్నగారు చెప్పిన ఆ మాటనూ నేనూ నమ్మాను. అందుకే వ్యాపార ప్రకటనల్లో నటించలేదు. అలా నటించడం వల్ల ప్రజలకు ఏమైనా మేలు చేకూరుతుందంటే చేస్తాను తప్ప.. డబ్బు కోసం మాత్రం చేయను. నాకు ఉన్నది చాలు'' అని చెప్పుకొచ్చారు బాలకృష్ణ.

బాలయ్య ప్రస్తుతం అమెరికా టూర్ లో ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...బాలకృష్ణ వారం రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం అమెరికా చేరుకున్నారు.సియాటెల్‌విమానాశ్రయానికి బాలకృష్ణకు అభిమానులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు.విమానాశ్రయం నుంచి బాలకృష్ణ బస చేస్తున్న హోటల్‌ వరకు ఆయన అభిమానులు కార్లలో ర్యాలీగా వెళ్లారు.

హైదరాబాద్‌లో ఇండో అమెరికన్‌క్యాన్సర్‌ ఆస్పత్రికివిరాళాలు ఇచ్చేందుకు వారు ఫండ్‌రైజింగ్‌ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రిసియాటెల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికిబాలకృష్ణముఖ్య అతిధిగా హాజరయ్యారు. కాగా, జూన్‌ 10న కాలిఫోర్నియాలో అభిమానులు నిర్వహిస్తున్న జన్మదిన వేడుకల్లో బాలకృష్ణ పాల్గొంటారు.

English summary
Balakrishna never did even a single ad. He will not do it in future and Balakrishna sharing the secret said he has a policy of not using his stardom earned from films for other purposes and his dad NTR is his inspiration.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu