For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ వివాదం పై నన్నేమీ అడగవద్దు, రోజులు లెక్కపెడుతున్నాను: దీపికా పదుకొణే

  |

  మొన్నటివరకూ తమిళ్ ఇండస్ట్రీలో వచ్చిన మెర్సల్ వేడి చల్లారక ముందే ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమామీద నిరసనలు మామూలుగాలేవు. దాదాపు దేశవ్యాప్తంగా బందులూ,నిరసనలూ జరుగుతున్నాయి. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ చరిత్రను వక్రీకరించారని రాజ్‌పుత్‌లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సినిమాలో మహారాణి పద్మావతి, అల్లావుద్దీన్‌ ఖిల్జీలమధ్య లవ్‌ సీన్స్‌ ఉన్నాయన్నది వారి ప్రధాన ఆరోపణ. ఆ సన్నివేశాలను తొలగించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్‌ ఇస్తున్నారు.

  ఆమెని కించపరిచే సినిమాకాదు !
  కల్పితగాథలే

  కల్పితగాథలే

  అసలు రాణి పద్మావతి చరిత్రకు సంబంధించిన ప్రామాణికమైన సమాచారమేది లేదని, ఇప్పటివరకు కల్పితగాథలే ప్రచారంలో వున్నాయని నవీన చరిత్రకారులు అభిప్రాయాపడుతున్నారు. అయితే రాజపుత్రులు మాత్రం ధైర్యసాహసాలకు, స్వాభిమానానికి ప్రతీకగా రాణిపద్మావతిని అభివర్ణిస్తారు. అక్కడ మొదలైంది సమస్య.

  రాణి పద్మావతి-అల్లావుద్దీన్‌ఖిల్జీ

  రాణి పద్మావతి-అల్లావుద్దీన్‌ఖిల్జీ

  ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించి రాణి పద్మావతి-అల్లావుద్దీన్‌ఖిల్జీ మధ్య ప్రణయ సన్నివేశాల్ని సృష్టించారని రాజ్‌పుత్ సంఘాల ప్రధాన ఆరోపణ. కోల్హాపూర్‌లో చిత్రీకరణను రాజ్‌పుత్ సంఘాలు అడ్డుకున్నాయి. పెట్రోల్‌బాంబులు, కర్రలతో దాడి చేసి భయానక వాతావరణాన్ని సృష్టించాయి.

   జంతువులు కూడా గాయపడ్డాయి

  జంతువులు కూడా గాయపడ్డాయి

  ఆ సమయంలో అక్కడ షూటింగ్ కోసం తీసుకొచ్చిన కొన్ని జంతువులు కూడా గాయపడ్డాయి. అక్కడి సెట్‌లో రాణిపద్మావతి-అల్లావుద్దీన్‌ఖిల్జీ మధ్య రొమాంటిక్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారన్న నెపంతో కోల్హాపూర్ దాడి జరిగినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. సెప్టెంబర్‌లో విడుదల చేసిన దీపికాపదుకునే ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ను జైపూర్‌లో కర్నీసేన సభ్యులు దహనం చేశారు.

  కరణ్ కేఎస్ వేసిన రాణి పద్మావతి రంగోలిని

  కరణ్ కేఎస్ వేసిన రాణి పద్మావతి రంగోలిని

  సూరత్‌కి చెందిన చిత్రకారుడు కరణ్ కేఎస్ వేసిన రాణి పద్మావతి రంగోలిని కొందరు ధ్వంసం చేశారు. ఈ విషయం కేంద్రమంత్రి స్మృతిఇరానీ వరకు చేరడంతో ఐదుగురు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా నిర్మాణం నుంచి వరుస దాడులు, బెదిరింపులతో పద్మావతి చిత్రీకరణ వివాదాలమయంగా సాగిపోతున్నది.

   ఊహాగానాలు, పుకార్లు, వక్రీకరణలే

  ఊహాగానాలు, పుకార్లు, వక్రీకరణలే

  అయితే సంజయ్ లీలా భన్సాలి మాత్రం వారు అన్నీ ఊహించుకుంటున్నారంటూ కొట్టి పడేసాడు. డిసెంబర్ 1న 'పద్మావతి' సినిమాను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ ఎత్తున వివాదం చెలరేగుతున్న క్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈసినిమాతో ఎవరి మనోభావాలు దెబ్బతినవని అన్నారు. 'పద్మావతి' సినిమాపై ఇప్పటివరకు వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలు, పుకార్లు, వక్రీకరణలేనని చెప్పాడు.

   తనేమీ మాట్లాడనని అనేసింది

  తనేమీ మాట్లాడనని అనేసింది

  దీపికా మాత్రం తను ప్రధాన పాత్ర పోషించిన ‘పద్మావతి' చిత్రంపై బయట ఇంత జరుగుతూంటే, చెలరేగిన వివాదం గురించి అడగొద్దనీ, దాని గురించి తనేమీ మాట్లాడనని అనేసింది. ఆదివారం రాత్రి ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్‌ షో నైట్‌కు ఆమె హాజరయ్యింది.

   రోజులు లెక్కపెడుతున్నాను

  రోజులు లెక్కపెడుతున్నాను

  ‘సినిమా పోస్టర్లు, సాంగ్స్‌, ట్రైలర్‌ చూసిన వారంతా అద్భుతం అని ప్రశంసిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ఆ చిత్రం ఓ అద్భుతమైన జర్నీ. అందరితో పాటు ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూసేస్తామా అని రోజులు లెక్కపెడుతున్నాను' అని చెప్పింది దీపిక.

  English summary
  The countdown has begun for Sanjay Leela Bhansali's much-awaited film Padmavati. Actress Deepika Padukone, who features as Rani Padmavati in the film, says that she can't wait for the film's release
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X