»   » 'బాహుబలి' ఆ హీరోకు భయపడే...వాయిదా? (వీడియో)

'బాహుబలి' ఆ హీరోకు భయపడే...వాయిదా? (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఓ ప్రక్క ఎప్పుడెప్పుడా అని 'బాహుబలి' కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. సినీ పరిశ్రమ సైతం ఆ సినిమా విడుదలపై ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తోంది. ఈలోగా త్వరలోనే 'బాహుబలి' సందడి షురూ కాబోతోందంటూ రాజమౌళి ప్రకటన చేసారు. చిత్రాన్ని జులైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రకటించారు. అయితే రాజమౌళి ఇంతకు ముందు అన్న తేదీ కాకుండా ఎందుకు ఇలా హఠాత్తుగా తేదీ మార్చారు అన్నదానకి సమధానం ఇదేనా ...చూడండి..మరి...


ఇక రాజమౌళి ...బాహుబలి ని.. మే 31న ట్రైలర్‌ని విడుదల చేస్తున్నామని ఆయన తెలియజేశారు. మే1 నుంచి ఒక్కో ప్రధాన పాత్రకు సంబంధించి ప్రచార చిత్రాల్ని విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. దీని సంబంధించి రాజమౌళి ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


''సినిమాని మే 15న విడుదల చేస్తున్నామని ఇది వరకు నేనే చెప్పా. అయితే నిర్మాణానంతర పనులు పూర్తి కాకపోవడంతో అది కుదరలేదు. ట్రైలర్‌ను పక్కాగా మే 31న విడుదల చేస్తాం'' అని ఆ వీడియోలో చెప్పారు రాజమౌళి. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యమున్న ఈ చిత్రం కోసం రాజమౌళి బృందం రేయింబవళ్లు కష్టపడుతోంది. 17 వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోల్లో 600 మంది సాంకేతిక నిపుణులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారనీ, అయినా అనుకొన్న సమయానికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయామని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు రాజమౌళి.


Why Did Baahubali Movie Release Get Postponed

రూ.200 కోట్ల పైచిలుకు వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ హీరోగా నటించారు. అనుష్క, తమన్నా హీరోయిన్స్. రానా ముఖ్యభూమిక పోషించారు. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో విడుదల కానుంది. ప్రభాస్‌ కూడా ఫేస్‌బుక్‌ ద్వారా 31న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నామని ప్రకటించారు.

English summary
Rajamouli's Baahubali Movie Release Get Postponed because of Singam 123.
Please Wait while comments are loading...