»   » కట్ చేసే హక్కు మీకెక్కడిది? సెన్సార్ బోర్డును మందలించిన ముంబై హైకోర్ట్ (ఫొటో స్టోరీ)

కట్ చేసే హక్కు మీకెక్కడిది? సెన్సార్ బోర్డును మందలించిన ముంబై హైకోర్ట్ (ఫొటో స్టోరీ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఉడ్తా పంజాబ్ విశయం లో చోటు చేసుకున్న పరిణామాల పై కేంద్ర సెన్సార్ బోర్డుపై ముంబై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డగ్స్ మాఫియా నేపథ్యం లో తెరకెక్కిన "ఉడ్తా పంజాబ్" మూవీలో 89 సీన్లకు కట్ చెప్పిన సెన్సార్ బోర్డును కోర్టు తీవ్రంగా మందలించింది.

"సెన్సార్ బోర్డు కేవలం సినిమాలకు వాటి లో ఉన్న విషయాన్ని బట్టి సర్టిఫికెట్లు మాత్రమే ఇవ్వాలి, సర్టిఫికెట్ ఇచ్చేముందు అందులో ఉన్న అభ్యంతర కర విశయాలను తొలగించమనే సూచన మట్టుకు చేయవచ్చు కానీ, వాటిలో ఉండే సీన్లను తొలగించటం వంటి పనులు చేసే అధికారం బోర్డుకు లేదని ఆ కేసు విచారణ సందర్భంగా హై కోర్టు అభిప్రాయపడింది.

ఉడ్తా పంజాబ్ విశయం లోన్ సెన్సార్ బోర్డు వైఖరిని నిరసిస్తూ బాలీవుడ్ డైరక్టర్ల సంఘం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ విశయం లో మొదటినుంచీ జరిగిన విశయాలను పరిశీలించిన హైకోర్టు. సెన్సార్ బోర్డుని చీవాట్లేసింది. సినిమా గురించిన విశయాన్ని ప్రజలకు తెలియ జేసే విధంగా సర్టిఫికెట్ ఇవ్వటమే తప్ప స్వయంగా ఎలా ఎడిట్ చేసే పనికి పూనుకుంటారంటూ ఘాటుగానే ప్రశ్నించింది.

సినిమాలో మాదకద్రవ్యాల అంశాన్ని అతిగా చూపిస్తున్నారని అనుకున్నప్పుడు, ఆ ఫిల్మ్ ను ఎందుకు పూర్తిగా నిషేధించలేదని సెన్సార్ బోర్డును కోర్టు ప్రశ్నించింది. టీవీ కార్యక్రమాలైనా, సినిమా అయినా ఓ రాష్ట్రాన్ని కించపరిచేవిధంగా చూపిస్తున్నారని అనిపిస్తే, ఆ అంశాన్ని ప్రజలకే వదిలేయాలని కోర్టు వ్యాఖ్యానించింది.

ఉడ్తా పంజాబ్ చిత్రంలో ఉన్న బూతు పదాలు, సీన్లను తొలిగించాలని సెన్సార్ బోర్డు కోర్టు విచారణ సందర్భంగా కోరింది. ఆ ఫిల్మ్ లో ఓ శునకానికి చాకీ చాన్ పేరు పెట్టారని, ఇది వివాదాస్పదమవుతోందని సెన్సార్ బోర్డు వాదించింది. అందుకే ఆ సీన్ ను కట్ చేసినట్లు బోర్డు కోర్టుకు విన్నవించింది.

షాహిద్ కపూర్ నటిస్తున్న ఉడ్తా పంజాబ్ సినిమా ఈనెల 17న రిలీజ్ కానుంది. ఓ సాంగ్ లో హీరో షాహిద్ కపూర్ పబ్లిక్ ముందు మూత్రం పోస్తున్నట్లు ఉన్న సీన్ ను కట్ చేసేందుకు నిర్మాతలు అంగీకరించారు. ఉడ్తా పంజాబ్ ఫిల్మ్ కోసం సెన్సార్ బోర్డు పై వేసిన కేసు పట్ల ముంబై హైకోర్టు సోమవారం తుది తీర్పును వెల్లడించనుంది.

షాహీద్ కపూర్

షాహీద్ కపూర్

షాహీద్ కపూర్, ఆలియా భట్, కరీనా కపూర్, దల్జిత్ సింగ్ లు ప్రధాన పాత్రల్లో డ్రగ్ మాఫియా ప్రధానాంశం గా తెరకెక్కిన ఉడ్తా పంజాబ్ వివాదం ఇంకా ముదురుతోంది.

సెన్సార్

సెన్సార్

వివాదాస్పద,అశ్లీల దృశ్యాలున్నాయన్న కారణం తో సెన్సార్ బోఋడ్ ఈ సిన్మా మీద ఏకంగ 89 సార్లు కత్తెర వాడింది.

డ్రగ్ అడిక్ట్

డ్రగ్ అడిక్ట్

ఇందులో షాహిద్ కపూర్ డ్రగ్ అడిక్ట్ అయిన మ్యూజీషియన్ పాత్రలో నటిస్తున్నాడు. అతను అసభ్యకరంగా మాట్లాడే సన్నివేశాన్ని పూర్తిగా తొలగించాలని సెన్సార్ బోర్డు కోరింది. ఐతే ఆ సీన్ తీసేస్తే సినిమాకు అర్థమే ఉండదంటోంది చిత్ర యూనిట్.

బాడీ

బాడీ

ఈ సినిమా కోసం తన బాడీని అద్బుతంగా మార్చుకున్నాడు షాహీద్ కపూర్. డ్రగ్ ఎడిక్ట్ గా కనిపించటానికి చాలా శ్రమపడ్డాడూ.

ఆలియాభట్

ఆలియాభట్

ఆలియాభట్ కూడా పాపం చాలానే కష్ట పడింది. పొలాల్లో పనిఒ చేస్తూ హాకీ నేర్చుకునే అమ్మాయిగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది.

సెన్సార్ బోర్డు

సెన్సార్ బోర్డు

అయితే ఈ కష్టమంతా సెన్సార్ బోర్డు వారిముందు బూడిదలో పోసిన పన్నీరయ్యింది.

ఉడ్తా పంజాబ్

ఉడ్తా పంజాబ్

సినిమాలో అబ్యంతరకర సన్ని వేశాలున్నాయంటూ 89 సన్నివేశాలకు కత్తెర వేసారు. దంతో ఉడ్తా పంజాబ్ టీం డీలా పడిపోయింది.

షేమ్ ఆన్ సెన్సార్ బోర్డ్

షేమ్ ఆన్ సెన్సార్ బోర్డ్

కానీ అదే సమయం లో నెటిజన్లనుంచి సినిమాకి అనుకోని సపోర్ట్ లభించింది. "షేమ్ ఆన్ సెన్సార్ బోర్డ్" అనే ఆష్ ట్యాగ్ తో నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా జనాలు సెన్సార్ బోర్డును ఓ రేంజిలో ఆడుకున్నారు..

అశోక్ పండిట్

అశోక్ పండిట్

ఇదే సమయం లో బాలీవుడ్ పరిశ్రమ నుంచి కూడా మద్దతు లభించింది. అశోక్ పండిట్ నేతృత్వంలో నటులు, దర్శకులు కలిసి ఉడ్తా పంజాబ్ కి తమ మద్దతు తెలిపారు.

ఆమ్ ఆద్మీ పార్టీ

ఆమ్ ఆద్మీ పార్టీ

ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి అనురాగ్ కశ్యప్ లంచం తీసుకున్నారని ఆరోపణలు చేసి సినిమా పరిశ్రమను నిహలానీ అవమానించారని, దానికి ఆయన ఖచ్చితంగా నురాగ్ కి క్షమాపనలు చెప్పాలనీ నటుడూ,దర్సకుడూ అశోక్ పండిట్ మండిపడ్డారు. సెన్సార్ బోర్డు పదవికి నిహలానీ తగరని ముఖేశ్ భట్ కూడా అభిప్రాయ పడ్డారు.

ఉడ్తా పంజాబ్

ఉడ్తా పంజాబ్

ఉడ్తా పంజాబ్ విశయం లోన్ సెన్సార్ బోర్డు వైఖరిని నిరసిస్తూ బాలీవుడ్ డైరక్టర్ల సంఘం కోర్టును ఆశ్రయించింది. ఈ విశయం లో మొదటినుంచీ జరిగిన విశయాలను పరిశీలించిన హైకోర్టు. సెన్సార్ బోర్డుని చీవాట్లేసింది. సినిమా గురించిన విశయాన్ని ప్రజలకు తెలియ జేసే విధంగా సర్టిఫికెట్ ఇవ్వటమే తప్ప స్వయంగా ఎలా ఎడిట్ చేసే పనికి పూనుకుంటారంటూ ఘాటుగానే ప్రశ్నించింది.

షాహిద్ కపూర్

షాహిద్ కపూర్

ఈనెల 17న రిలీజ్ కావాల్సి ఉంది. ఓ సాంగ్ లో హీరో షాహిద్ కపూర్ పబ్లిక్ ముందు మూత్రం పోస్తున్నట్లు ఉన్న సీన్ ను కట్ చేసేందుకు నిర్మాతలు అంగీకరించారు. ఉడ్తా పంజాబ్ ఫిల్మ్ కోసం సెన్సార్ బోర్డు పై వేసిన కేసు పట్ల ముంబై హైకోర్టు సోమవారం తుది తీర్పును వెల్లడించనుంది.

English summary
The Bombay High Court has indicated it will allow the release of the film 'Udta Punjab', that allegedly portrays the state's drug problem, with only one cut, out of the 13 the Central Board of Film Certification (CBFC) suggested, paving the way for its smooth launch on 17 June. However, the court has reserved its final order for Monday, 13 June.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X