»   »  ఎన్టీఆర్ పొలిటికల్ కుస్తీ..సినిమాకు సుస్తీ?

ఎన్టీఆర్ పొలిటికల్ కుస్తీ..సినిమాకు సుస్తీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jr Ntr
ఎన్టీఆర్ కి అన్ని వర్గాల్లో మంచి ఆదరణ ఉండటంతో చంద్రబాబు ఆయన్ని తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వినియోగించుకునేందుకు రెడీ అవుతున్నారన్న సంగతి తెలిసిందే . దాంతో ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ పై సినిమాల కంటే రాజకీయ ఒత్తిడి ఎక్కువైంది. అంతేగాక ఎన్టీఆర్ సన్నిహితులు చాలా మందికి ఆయన పార్టీ టిక్కెట్లు ఇప్పించి గెలిపించాలని యోచిస్తున్నారని సమాచారం. దాంతో దృష్టిని మొత్తం అటు వైపు పెట్టవలసి వస్తోందని,సినిమాలపై శీతకన్ను వేయాల్సివస్తోందని సమాచారం.

అంతేగాక ఎట్టిపరిస్దితుల్లోనూ ఆయనకు స్నేహితుడు,నిర్మాత అయిన వంశీకృష్ణకు,కొడాలి నానీలని టిక్కెట్టు ఇప్పించి గెలిపించాలని కృత నిర్చయింతో ఉన్నాడని అంటున్నారు. ఈ నేపద్యంలో వినాయిక్ తో సినిమా ఎంత వరకూ ముందుకెళ్తుంది అనేది ఆయన సినీ అభిమానులకు బెంగగా ఉంది. అంతేగాక ఎన్టీఆర్ గతంలో లా కాకుండా కథల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్నారని...ఏ కథ చెప్పినా నచ్చటం లేదని మరో టాక్.

ఇక వినాయిక్ కూడా తన తండ్రికి ఎమ్మేల్యే సీటు ప్రజారాజ్యంలో ఇప్పించాలని ఆలోచనలో తిర్గుతున్నాడని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి. ఇలా ఎవరికి వారే ఏదో ఒక పార్టీ తీరు అన్నట్లు తిరగటమే సినిమా లేటవుతోందని చెప్తున్నారు. ఏదైమైనా సింహాద్రి లాంటి మెగా హిట్ ని ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి అబిమానులు ఆశిస్తున్నారు. ఆ విషయం కూడా కాస్త ఎన్టీఆర్ పట్టించుకుంటే బాగుండునని శ్రేయాభిలాషులు అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X