For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‌నిజమా: చిరుని హఠాత్తుగా పవన్ కలవటానికి కారణం?

By Srikanya
|

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు, రాజ్యసభ ఎంపీని చిరంజీవిని ఆయన తమ్ముడు సినీనటుడు పవన్‌కల్యాణ్‌ ఆదివారం సాయంత్రం కలిసిన సంగతి తెలిసిందే. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ చిత్ర షూటింగ్‌లో ఉన్న పవన్‌కల్యాణ్‌ అదే గెటప్‌లో చిరంజీవి ఇంటికి వెళ్లారు.

అయితే హఠాత్తుగా పవన్ తన అన్న చిరంజీవి ఇంటికి అదీ గబ్బర్ సింగ్ గెపట్ లో వెళ్లటానికి కారణం కేవలం అభినందించటానికేనా లేక మరేదన్నా ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

బ్రూస్ లీ సినిమాని ఇంకా చూడలేదని చెప్పిన పవన్ ...ఇలా వెళ్లటానికి కారణం కేవలం పవన్ ఫ్యాన్స్ సైతం ఈ చిత్రానికి మద్దతు ఇవ్వటానికి మాత్రమే అంటున్నారు కొందరు.

సినిమా రిలీజైన రోజు నుంచి ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ సైతం రెండో రోజుకే డ్రాప్ అయ్యాయి. ఈ నేపధ్యంలో పవన్ సెట్ కు రామ్ చరణ్ వెళ్లి కలిసారు. అనంతరం చిరంజీవి ని వెళ్లి పవన్ కలవటం జరిగింది.

స్లైడ్ షోలో... మిగతా స్టోరీ

బూస్ట్ ఇవ్వటానికే

బూస్ట్ ఇవ్వటానికే

కలెక్షన్స్ కు బూస్ట్ ఇవ్వటానికే ఈ పని రామ్ చరణ్ కోరిక మీద పవన్ చేసాడంటున్నారు.

విభేధాలు

విభేధాలు

పవన్ కు, చిరంజీవి మధ్య విభేధాలు ఉన్నాయని బయిట టాక్ ఉండటంతో బ్రూస్ లీకి పవన్ ఫ్యాన్ దూరంగా ఉండటం జరిగిందని సమాచారం.

గమనించాడు

గమనించాడు

తమ ఫ్యాన్స్ ఇలా విడిపోయి తన సినిమాకు దెబ్బ కొట్టడం జరిగిందని గమనించిన రామ్ చరణ్ వెంటనే వెళ్లి పవన్ ని కలిసాడంటున్నారు.

అదే సమయంలో

అదే సమయంలో

చిరంజీవి ని పవన్ కళ్యాణ్ కలిసిన సమయంలో రామ్ చరణ్ కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఉండటం అందుకే అంటున్నారు.

రూమరా కాదా

రూమరా కాదా

అయితే ఇది రూమరా లేక నిజంగానే ఇదే స్ట్రాటజీని అనేది ప్రక్కన పెడితే ఎంతవరకూ ఈ మీటింగ్ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ పై పడుతుందనేది చూడాలి.

వీడియో

చాలా విరామం తర్వాత 'బ్రూస్‌లీ' చిత్రంలో కనిపించిన అన్నయ్య చిరంజీవికి పవన్‌ అభినందనలు తెలిపారు. ఆ వీడియోని ఇక్కడ చూడండి.

శ్రీను వైట్ల ట్వీట్

ఈ విషయమై బ్రూస్ లీ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల ఈ విషయమై ట్వీట్ చేసారు.

అరుదుగా కలిసాం

అరుదుగా కలిసాం

'చాలా విరామం తర్వాత అన్నయ్య మళ్లీ సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. పొలిటికల్ జర్నీ మొదలయ్యాక మేం చాలా అరుదుగా కలుసుకున్నాం. రాజకీయాల పరంగా మా ఇద్దరి విధానాలు వేరైనా వ్యక్తిగతంగా అన్నయ్య అంటే నాకు ఇష్టం, గౌరవం అని పవన్ అన్నారు.

అందుకే కలిసా..పవన్

అందుకే కలిసా..పవన్

నా సినీ జీవితానికీ, ఇంత మంచి జీవితానికి కారకుడైన అన్నయ్య మళ్లీ నటించినందుకు ఆనందం అనిపించి, అభినందించాలనుకున్నాను'' అని పవన్ కల్యాణ్ అన్నారు.

మూడు నిముషాలే..

మూడు నిముషాలే..

రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన 'బ్రూస్‌లీ' గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి మూడు నిముషాల పాటు సాగే అతిథి పాత్ర చేశారు.

150 పువ్వులు

150 పువ్వులు

చిరంజీవిని అభిమానించే అందరి తరపున ఆయన రీ-ఎంట్రీని ప్రత్యేకంగా అభినందించాలనుకున్న పవన్ కల్యాణ్ 150 పువ్వులతో అందమైన పుష్పగుచ్ఛం తయారు చేయించారు. ఆదివారం సాయంత్రం చిరంజీవి ఇంటికి స్వయంగా వెళ్లి, కలిశారు.

చూడలేదు..

చూడలేదు..

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ - ''నేనింకా 'బ్రూస్‌లీ' చూడలేదు. చూసినవాళ్లు అన్నయ్య ఎంట్రీ సీన్ అప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయని అంటుంటే సంతోషం అనిపించింది. అన్నయ్య నటించబోయే 150వ చిత్రం కూడా విజయం సాధించాలి'' అన్నారు.

కథలు సిద్దం

కథలు సిద్దం

రామ్‌చరణ్‌తో తీయబోయే సినిమాకు సంబంధించి రెండు, మూడు కథలు సిద్ధంగా ఉన్నాయని పవన్ అన్నారు.

సంక్రాతికే..

సంక్రాతికే..

ప్రస్తుతం తాను నటిస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్'ను సంక్రాంతికి విడుదల చేయడానికి ట్రై చేస్తున్నామని తెలిపారు.

ఎడ్జెస్ట్ ని బట్టే...

ఎడ్జెస్ట్ ని బట్టే...

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లాలనే ఉందనీ, షూటింగ్ షెడ్యూల్స్ అడ్జస్ట్ అయ్యేదాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని పవన్ స్పష్టం చేశారు.

English summary
Apparently, looking at the poor box office performance of Bruce Lee, mega heroes reportedly felt that there still a state of chaos among the mega groups. So to put an end to the doubts once for all, they took Chiru's cameo in Bruce Lee as an occasion to appear before media and say they are all one.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more