»   » 'ఆరడుగుల బుల్లెట్' పవన్ గుర్తొస్తున్నాడు... అని వద్దన్నాడట

'ఆరడుగుల బుల్లెట్' పవన్ గుర్తొస్తున్నాడు... అని వద్దన్నాడట

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోపీచంద్ తొలివలపు అనే సినిమా తో హీరోగా టాలీవుడ్ లో అడుగు పెట్టినా సరైన బ్రేక్ లేక అవకాశాలు రాలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకొని విలన్ గా వచ్చి నటన లో తానేమిటో నిరూపించుకున్నాడు ఈ మాస్ హీరో. తేజా సినిమా నిజం, జయం లలో గోపీచంద్ చేసిన విలన్ పాత్రలకి విపరీతమైన ప్రశంసలు వచ్చాయి.

Why PVP hating Pawan Kalyan's title Aaradugula Bullet?
  

ఇక వర్షం లో చేసిన పాత్ర తో హీరో తో సమానమైన క్రేజ్ తెచ్చుకున్నాడు గోపీచంద్. ఆ పాపులారిటీ తో యగ్నం లాంటి ఒక మామూలు కథ తో హీరోగా మళ్ళీ అడుగు పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ వరుసగా రెండు ఫ్లాపులు అయినా లక్ష్యం తో మళ్ళీ ఇంకో హిట్ కొట్టాడు. అయితే మొదటినుంచీ గోపీచంద్ కెరీర్ ఒడిదుడుకులతోనే సాగుతోంది. పక్కాగా ఇంతవరకూ నిలబడ లేకపోయాడు. పెర్ఫార్మెన్స్ లో ఏ తేడాలేకపోయినా కథలను ఎంచుకోవటమే గోపీచంద్ మైనస్ అంటారు సినీ విశ్లేషకులు.

ఇటీవల తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరో గోపీచంద్. గోపీచంద్ సినిమాలు వరసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. గత కొంత కాలం గా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు గోపీ చంద్. కొంతకాలం క్రితం బి.గోపాల్ దర్శకత్వంలో .. తాండ్ర రమేష్ నిర్మాణంలో, గోపీచంద్ - నయనతార జంటగా ఓ సినిమా రూపొందింది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ .. రెండు పాటలు పెండింగ్ లో ఉండగా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఆ వర్క్ ను పూర్తి చేసి .. రిలీజ్ చేయడానికి ప్రసాద్ వి. పొట్లూరి సిద్ధమయ్యారు.

Why PVP hating Pawan Kalyan's title Aaradugula Bullet?

దర్శక నిర్మాతలు ఈ సినిమాకి 'ఆరడుగుల బుల్లెట్' అనే టైటిల్ ను ఖరారు చేయాలనుకున్నారు. అయితే అందుకు ప్రసాద్ వి. పొట్లూరి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారట. ఈ టైటిల్ వినగానే అందరికీ పవన్ కల్యాణ్ గుర్తొస్తాడని ఆయన అన్నారట. అందువలన ఈ సినిమాకి ఆ టైటిల్ వాడటం సరికాదని .. మరో టైటిల్ చూడమని చెప్పారు. దాంతో దర్శక నిర్మాతలు మరో టైటిల్ గురించిన ఆలోచన చేస్తున్నారు.

English summary
PVP did not love the title Gopichand's Upcoming Movie "Aradugula Bullet" at all and he just asked the makers to remove it down. PVP loved the content of the film but the title is what he stepped backward.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu