»   » బాహుబలిలో చాన్సివ్వలేదేం: కీరవాణిని మొహం మీదే అడిగిన కోట!

బాహుబలిలో చాన్సివ్వలేదేం: కీరవాణిని మొహం మీదే అడిగిన కోట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ నుండి వచ్చిన భారీ చిత్రాల్లో నెం.1 చిత్రం ఏదంటే ముందుగా అందరూ చెప్పేది 'బాహుబలి' సినిమానే. అత్యంత భారీ బడ్జెట్ తో భారీ తారాగణం, భారీ గ్రాఫిక్స్ ఇలా అన్నింటిలో భారీతనం ప్రదర్శించిన ఈ సినిమాలో నటించాలని ప్రతి ఒక్క తెలుగు నటుడూ ఆశ పడ్డారు. ఈ సినిమాలో అవకాశం రాని కొందరు తెలుగు నటులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెలుబుచ్చారు.

తాజాగా తెలుగు సినిమా ప్రముఖుడు, సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కూడా తన మనసులోని అసంతృప్తిని బయట పెట్టారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమానికి కోట శ్రీనివాసరావు, కీరవాణి లను అతిధులుగా వచ్చారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ....తాను కోట శ్రీనివాసరావు అభిమానిని అని చెప్పుకొచ్చారు. దీనికి స్పందించిన కోట కీరవాణి అభిమానిగా పొందగలిగిన అంత మంచి నటుడినైతే రాజమౌళి తనకు బాహుబలిలో అవకాశం ఎందుకు ఇవ్వలేదంటూ నవ్వుతూ కీరవాణిని కోట కార్నర్ చేశారు.

Why Rajamouli didn't give chance to Kota in Baahubali?

ఏ విషయాన్ని అయినా మొహమాటం లేకుండా చెప్పే కోట అలా అనడంతో కీరవాణి కాస్త కంగారు పడ్డారు. రాజమౌళిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసారు. 'తాతకు దగ్గులు నేర్పడం వాడికి ఇంకా చేత కాదు' అంటూ కామెంట్స్ చేసి కోటకు సర్ది చెప్పాడానికి ప్రయత్నించాడు. రాజమౌళి దర్శకత్వంలో కోట శ్రీనివాసరావు గతంలో 'ఛత్రపతి'లో ఒక ముఖ్యమైన పాత్ర చేసిన సంగతి తెలిసిందే.

బాహుబలి చిత్రం గతేడాది రిలీజై బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి-2' శరవేగంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తొలి భాగం భారీ విజయం సాధించిన నేపథ్యంలో బాహుబలి-2పై అంచనాలు భారీగా ఉన్నాయి. 2017 ఏప్రిల్ 14 నాటికి బాహుబలి పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Why Rajamouli didn't give chance to Kota in Baahubali?. Keeravani, who claims himself to be the biggest fan of Kota, says that Rajamouli didn’t yet learn to teach acting to a seasoned actor like Kota.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu