»   » రకుల్ పవన్ కి "నో" చెప్పటానికి కారణం ఇదే

రకుల్ పవన్ కి "నో" చెప్పటానికి కారణం ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టార్ హీరోతో చాన్స్ వస్తే చాలు.. ఎగిరి గంతేసే హీరోయిన్లు ఉన్నారు. అదీ పవన్ కల్యాణ్‌తో చాన్స్ అంటే.. ఆ పిచ్చి పీక్స్‌లో ఉండాల్సిందే. కానీ, తన స్టార్‌ను సూపర్ స్టార్‌గా మార్చేసుకున్న ఓ హీరోయిన్ మాత్రం నో చెప్పేసిందట! తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత ఒక్కసారే స్టార్ డమ్ తెచ్చుకున్న పవన్ తర్వాతా అత్తారింటికి దారేది చిత్రంతో మంచి ఫ్యామిలీ హీరో అనిపించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఇప్పుడు నటుడిగానే కాకుండా మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో పవన్ సరసన చాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది..కానీ టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో దూసుకెళుతున్న ఈ భామ మాత్రం పవన్ తో చాన్స్ వస్తే నో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

 Why Rakul Preet Singh Refuses to Act with Pawan Kalyan

ఆ సూపర్‌స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. దాదాపు స్టార్ హీరోలందరితోనూ జట్టు కట్టిన రకుల్ ప్రీత్ సింగ్. మరి అందరూ టాప్ హీరోల సరసన నటించిన రకుల్.. పవన్‌కు నో చెప్పడానికి గల కారణమేంటి? అంటే డేట్లు అడ్జెస్ట్ కాకపోవడమేనట. ప్రస్తుతం కాటమరాయుడు సినిమాతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో, దాని తర్వాత ఏఎం రత్నంతో ఆర్టీ నీసన్ దర్శకత్వంలో నటించబోతుండడం తెలిసిందే.

అయతే.. ఆర్టీ నీసన్‌తో చేసే సినిమాలో పవన్‌కు జోడీగా రకుల్‌ను అనుకున్నారు. అయితే.. ఆ ఆఫర్‌ను మాత్రం ఆమె తిరస్కరించిందట. ఎందుకంటే.. ప్రస్తుతం మహేశ్‌బాబు-మురుగదాస్ డైరెక్షన్‌లో చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నాగచైతన్య, సాయిధరమ్‌తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్‌ల చిత్రాలతో బిజీగా ఉంటుందట.ఇవే కాక పలు తమిళ సినిమాలు కూడా ఈ అమ్మడి చేతిలో ఉన్నాయని సమాచారం. దీంతో తనకు డేట్స్ కుదరకపోవడం వల్లే సినిమా చాన్స్ వస్తే మిస్ చేసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆయా చిత్రాల డేట్ల వల్ల.. పవన్ సినిమాకు డేట్లను అడ్జెస్ట్ చేయలేనని ఆ చిత్ర నిర్మాతలకు తేల్చి చెప్పిందట.

English summary
Pawan Kalyan is currently starring in Katamarayudu and is readying for his next under the direction of RT.Neason. Film is a remake of Tamil hit Vedhalam and filmmakers planned to cast Rakul Preet Singh. But when contacted Rakul shocked them by rejecting the offer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu