»   » రేప్..ఇండియా జోక్ ఎందుకంటే? : పూరి జగన్నాథ్ (వీడియో)

రేప్..ఇండియా జోక్ ఎందుకంటే? : పూరి జగన్నాథ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తన అభిప్రాయాలను నిర్మహమాటంగా చెప్పే విషయంలో పూరి ఎప్పుడూ ముందుంటారు. అలాగే తను చూసిన వర్క్ కానీ, సమాజానికి పనికొచ్చే విషయం కానీ, ఆలోచనలో పడేసే వీడియో కానీ ఉంటే వెంటనే తన సోషల్ నెట్ వర్కింగ్ పేజీలో షేర్ చేస్తూంటారు. తాజాగా ఆయన ఇండియాలో రేప్ అనేది ఓ జోక్ ఎందుకంటే అంటూ ఈ క్రింది వీడియోని షేర్ చేసారు. ఆయన ఈ వీడియోని ఎందుకు షేర్ చేసారో ...మీరూ చూసి చెప్పండి.

ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్...ఛార్మితో చేస్తున్న జ్యోతిలక్ష్మి చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు. ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘జ్యోతిలక్ష్మీ' చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. రీసెంట్ గా ...ఉమెన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసారు. ఆ ఫస్ట్ లుక్ కి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రను ఛార్మి పోషిస్తోంది. పూర్తి లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా దీన్ని తెరరెక్కిస్తున్నారు. టీజర్ చూస్తుంటే.... ఇది స్త్రీ వాద సినిమాగా స్పష్టమవుతోంది. స్త్రీ జాతిపై మగజాతి ఆధిపత్యాన్ని ప్రశ్నించేలా ఈ సినిమా ఉంటుందని టీజర్లో విడుదల చేసిన లైన్స్ చూస్తే స్పష్టం వుతోంది. జ్యోతి లక్ష్మి సినిమా అనగానే ఇది నిన్నటితరం ఐటం గర్ల్ జ్యోతి లక్ష్మి జీవితం గురించి అని అంతా అనుకుంటున్నారు. కానీ పూరి ‘జ్యోతి లక్ష్మి' కాన్సెప్టు ఇది కాదని స్పష్టమవుతోంది.

WHY RAPE IS A JOKE IN INDIA?: Puri Jagan

ఆ ఫస్ట్ లుక్ టీజర్ లో భాస్కరభట్ల రాసిన సాంగ్ ఇలా సాగుతుంది...

‘చేతికి గాజులు తొడిగి చేతకాని వాళ్లం అయిపోయామా... వంటింటి కుందేళ్లలాగా వందేళ్లయినా బ్రతికేద్దామా...ఆడోళ్లం ఆడోళ్లం మనం తోడేళ్లతో ఉంటున్నామా...ప్రాణాలు తోడేస్తూ ఉన్న నోరు మూసుకూర్చుందామా...'


ఛార్మి కౌర్‌, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాతలు శ్వేతలానా, వరుణ్‌, తేజ,సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
Puri Jagannath share a video of Why Rape is a Joke in India!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu