Don't Miss!
- News
గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!?
- Sports
ఇదో చెత్త పిచ్.. టీ20లకు పనికిరాదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
భరత్ అంత్యక్రియలకు భార్య ఎందుకు హాజరుకాలేందంటే.. మరికొన్ని వివరాలు..
హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు హాజరుకాకపోవడం సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఆయన మరణాంతరం భార్య కూడా హైదరాబాద్‌కు రాకపోవడం, భరత్ గురించి పట్టించుకోకపోవడం మరింత చర్చకు దారి తీసింది.

అమెరికాలో ఉంటున్న భార్య
భరత్ భార్య ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. వీరికి సంతానం లేరు. వ్యక్తిగత విభేదాల కారణంగా వారు వేర్వేరుగా ఉంటున్నారనే సినీ వర్గాల సమాచారం. భరత్ మ ప్రస్తుతం మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో తన తల్లి రాజ్యలక్షితోనే ఉంటున్నారు. అందుకే ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేదని, ఆమె తరఫున బంధువులు అక్కడ కానరాలేదనేది వార్త ప్రచారంలో ఉన్నది.

మద్యం సేవించే వాహనం..
భరత్ మృతి కేసులో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం మత్తులోనే ఆయన కారు నడిపినట్టు వెల్లడైంది. ప్రమాదానికి ముందు ఆయన నోవాటెల్ హోటల్‌లో గడిపిన దృశ్యాలు సీసీ కెమెరా రికార్డయ్యాయి. ఆ రోజు సాయంత్రం నోవాటెల్‌లో గడిపిన చిత్రాలు మీడియాకు చిక్కాయి.

స్నేహితుడి పార్టీలో మద్యం..
ప్రమాదం జరిగిన రోజు అంటే శనివారం ఆయన శంషాబాద్‌లోని నోవాటెల్‌లో స్నేహితుడి పుట్టినరోజు పార్టీకి హాజరయ్యారు. సాయంత్రం 4 గంటలకు స్విమ్మింగ్‌పూల్ వద్ద ఆయన మద్యం సేవించినట్టు సీసీ కెమెరా దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9.25 గంటల వరకు ఆయన నోవాటెల్‌లో గడిపారనే విషయం సీసీ కెమెరా ఫుటేజీల్లో తేలింది.

నోవాటెల్ నుంచి ఇంటికి..
ఆ తర్వాత అక్కడి నుంచి తన కారులో వెళ్లిపోయారు. రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఔటర్ రింగ్‌రోడ్డుపై కొత్వాల్‌గూడ వద్ద ఆగివున్న లారీని ఆయన కారు ఢీకొంది. సంఘటనా స్థలంలోనే భరత్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో ఆయన కారు 145 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అతివేగం, మద్యంమత్తు ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

10 గంటల ప్రాంతంలో ప్రమాదం..
భరత్ రాత్రి 9.20 గంటల సమయంలో హోటల్ నుంచి ఒంటరిగా తన స్కోడా ఒక్టావికా కారులో (టీఎస్ 09 ఈసీ 0799) ఇంటికి బయలుదేరినట్లు భావిస్తున్నారు. హోటల్ నుంచి దాదాపు 20-25 నిమిషాల ప్రయాణం తర్వాత ఆయన డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి లోనైంది. భరత్ నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొంటున్నారు.