»   » అప్పటి చేదు అనుభవాల వల్లే "అర్జున్ రెడ్డి" చేయనని చెప్పా: శర్వానంద్

అప్పటి చేదు అనుభవాల వల్లే "అర్జున్ రెడ్డి" చేయనని చెప్పా: శర్వానంద్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'అర్జున్ రెడ్డి' ఈ మధ్యకాలం లో ఒక టాలీవుడ్ సినిమా మీద ఇంత చర్చ జరిగిన సినిమా ఇదే. సోషల్ మీడియామొత్తం మీదా కొన్ని వందల రివ్యూలు, మరి కొన్ని వందల అభిప్రాయాలు. గతంలో ఎన్నడూ సినిమా విషయం మాట్లాడని వాళ్ళని కూడా ఈ సినిమా మీద చర్చ చేయటానికి పురికొల్పిన సినిమా ఇదేనేమో. ఇంత సెన్సేషనల్ హిట్లో హీరో విజయ్ దేవరకొండ కాంట్రిబ్యూషన్ చిన్నదేమీకాదు. ఒకరకంగా విజయ్, అర్జున్ రెడ్డి పాత్రకి ప్రాణం పోసాడు. ఈ ఒక్క సినిమా టాలీవుడ్ లోనే విజయ్ కి ఒక స్టార్ రేంజు తీసుకువచ్చింది. అయితే ముందు అనుకున్న ప్రకారం ఈ పాత్ర విజయ్ దేవరకొండచేయాల్సింది కాదు.

శర్వానంద్ చేయాల్సింది

శర్వానంద్ చేయాల్సింది

సినిమాను వాస్తవానికి శర్వానంద్ చేయాల్సింది. ముందుగా దర్శకుడు సందీప్ రెడ్డి శర్వాకే చెప్పాననీ. కానీ అనివార్య కారణాల వల్ల శర్వాతో సినిమా చేయలేకపోయానని ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లోనే చెప్పాడు సందీప్. అప్పటికే విజయ్ అర్జున్ రెడ్డి మీద తన మార్క్ వేసేసాడు. అయితే శర్వాతో సినిమా చేయలేకపోవటానికి కొన్ని కారణాలున్నాయి అన్నాడేకానీ ఆ అనివార్య కారణాలేంటన్నది సందీప్ వంగా వెల్లడించలేదు.

Akkineni Nagarjuna Comments On "Arjun Reddy" Movie
శర్వానంద్ ఆ గుట్టు విప్పాడు

శర్వానంద్ ఆ గుట్టు విప్పాడు

ఇంతా అయ్యాక తానే విషయం చెప్పెయ్యాలి అనుకున్నాడేమో తాజాగా శర్వానంద్ ఆ గుట్టు విప్పాడు. తాను పెట్టిన కండిషన్ వల్లే సందీప్ తనతో ‘అర్జున్ రెడ్డి' చేయలేకపోయాడని చెప్పేసాడు. నిజానికి సందీప్ చెప్పినప్పుడే ‘అర్జున్ రెడ్డి' కథ విపరీతంగా నచ్చిందని.. దీని మీద ఒక వర్క్ షాప్ కూడా చేసి ఆ తర్వాత షూటింగుకి వెళ్లాలని కూడా అనుకున్నాడట.

అశ్వినీదత్‌తో పాటు మరో నిర్మాత

అశ్వినీదత్‌తో పాటు మరో నిర్మాత

అయితే ‘అర్జున్ రెడ్డి' సినిమాను సందీప్ స్వీయ నిర్మాణంలో చేయాలనుకోవటం తో ఆ విషయంలోనే తాను అభ్యంతర పెట్టానని, సినిమా క్వాలిటీకోసం అశ్వినీదత్‌తో పాటు మరో నిర్మాతను కూడా తాను కలిసే ఏర్పాటు చేశానని. కానీ అవేవీ వర్కవుట్ కాకపోవటం, సందీప్ తనే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తాననడంతో సినిమా అనుకున్నట్టు రాకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని శర్వా తప్పుకున్నాడట.

కుదరదని చెప్పేసాడట

కుదరదని చెప్పేసాడట

దర్శకుడే నిర్మాత అయితే ఉండే ఇబ్బందులు ఇదివరకు చూసి ఉండటం తో అలా కుదరదని చెప్పేసాడట ఈ మహానుబావుడు. ప్రొడక్షన్ మీద దృష్టిపెడితే సినిమా సరిగా రాదని.. గతంలో ఈ విషయంలో తనకు కొన్ని చేదు అనుభవాలుండటంతోనే వేరే నిర్మాత ఉండాలని పట్టుబట్టానని శర్వా చెప్పాడు.

అతనే కరెక్ట్ అనిపించిందట

అతనే కరెక్ట్ అనిపించిందట

ఐతే ‘అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ చూశాక అతనే ఈ సినిమాకు కరెక్ట్ అనిపించిందని.. ఇంకెవరూ ఆ పాత్ర చేయలేరు అన్నట్లుగా అతను అదరగొట్టేశాడని శర్వా చెప్పాడు. అంత పెద్ద హిట్ కోల్పోయిన భాద మనసులో ఉన్నా మనస్పూర్తిగా విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ ని మెచ్చుకుంటూనే. అర్జున్ రెడ్డి టీమ్ వర్క్ ని కూడా మెచ్చుకున్నాడు శర్వానంద్.

English summary
Sarvanand Who won the Dussera Movie race this year open up's about Why he was Rejected Arjun Reddy Movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu