»   » తన రెమ్యూనరేషన్ గురించి సల్మాన్ ఖాన్ ఇలా..

తన రెమ్యూనరేషన్ గురించి సల్మాన్ ఖాన్ ఇలా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన రెమ్యూనరేషన్ గురించి అడిగితే ఆసక్తికరంగా సమాధారం ఇచ్చారు. తన తాజా సినిమా 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్న ఆయన్ను మీడియా వారు రెమ్యూనరేషన్ గురించి ప్రశ్నించారు.

"మీరు తీసుకుంటున్న జీతాల విషయంపై నాకు ఆసక్తి లేదు... మరి, నా జీతం విషయంపై మీకు ఎందుకంత ఆసక్తి? నేను తీసుకునే రెమ్యునరేషన్ పెరిగినా, అది బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ కే వెళుతుంది" అని చెప్పారు. 2007లో కొన్ని సంస్థలతో కలసి బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ను సల్మాన్ స్థాపించారు. ఆర్థిక సమస్యల్లో ఉన్న ఎంతో మందికి విద్య, వైద్య సేవలను ఈ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు.

 Why so much interest in my salary, asks Salman Khan

'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా విశేషాల్లోకి వెళితే...సల్మాన్‌ ఖాన్‌ హీరోగా సూరజ్‌ బర్‌జాత్యా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.

సల్మాన్‌తోపాటు సోనమ్‌ కపూర్‌, అనుపమ్‌ ఖేర్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే భజరంగీ బాయ్‌జాన్ సినిమా తో సల్లూభాయ్ మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో సల్మాన్‌ఖాన్‌తో దర్శకుడు సూరజ్‌ బర్‌జాత్యా మైనే ప్యార్ కియా, హమ్ సాత్ సాత్ హై,హమ్ ఆప్ కే కౌన్ వంటి సూపర్‌హిట్ చిత్రాలను తీశాడు. ఈ కాంబినేషన్ తాజాగా నాలుగోసారి ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది.

English summary
“I have no interest in your salary then why do have interest in my salary,” Salman responded here during a group interaction.
Please Wait while comments are loading...