»   » అసలు బాబీ చేసిన నేరమేమిటి?? ఎన్టీఆర్ ఎందుకు అరిచాడు ?

అసలు బాబీ చేసిన నేరమేమిటి?? ఎన్టీఆర్ ఎందుకు అరిచాడు ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనతా గారేజ్ చిత్రం తో పలు రికార్డులు తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం, సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో తెరకెక్కనుంది. పవర్ సినిమా తో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని తెలిసిందే.

'టెంపర్ ' , 'నాన్నకు ప్రేమతో', 'జనతా గారేజ్ ' చిత్రాలతో భారీ హ్యాట్ ట్రిక్ ను అందుకున్న ఎన్టీఆర్ మళ్ళీ సరికొత్త లుక్ తో ఈ సినిమాలో కనిపించనున్నారు. వచ్చే సంక్రాంతి పండుగ అనంతరం చిత్రం పూజా కార్యక్రమం ఉంటుంది అని చిత్ర బృందం తెలిపింది. ఆ వెంటనే నిరవధికం గా షూటింగ్ జరుపుకుని, వచ్చే ఏడాది ద్వితీయార్ధం లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ తెలిపింది. అయితే ఈ సినిమా సమాచారం బయటకు పొక్కటం తో జూనియర్ చిరాకు పడ్డాడట.., చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోవా అంటూ దర్శకుడు బాబీ ని మెత్తగానే కోపగించుకున్నాడంటున్నారు.

 తరువాతి సినిమా:

తరువాతి సినిమా:


టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ల తరువాత జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై నెలకొన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. జనతా గ్యారేజ్ విడుదలై ఇప్పటికీ మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ తన తరువాతి సినిమాను ప్రకటించకపోవడం, ఆ సినిమా గురించి ఎన్టీఆర్ పడుతున్న ఒత్తిడి గురించి వచ్చిన వార్తల నేపథ్యంలో.. ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

 తెరపడింది:

తెరపడింది:


అయితే, ఎట్టకేలకు పవర్ సినిమా దర్శకుడు బాబీతో కల్యాణ్ రామ్ బ్యానర్‌పై ఎన్టీఆర్ తరువాతి సినిమా ఉంటుందని కల్యాణ్‌రామ్ స్వయంగా ప్రకటించడంతో ఆ గందరగోళానికి తెరపడింది. సాధారణంగా తెలుగు సినిమాల్లో త్రిపుల్ రోల్ అంటే... తాత, తండ్రి, కొడుకు ఒకే రూపంలో ఉండటం చూస్తూ ఉంటాం.

 త్రిపుల్ రోల్ :

త్రిపుల్ రోల్ :


మరి ఈ సినిమాలోనూ అదే రోటీన్ కాన్సెప్టును త్రిపుల్ రోల్ లో చూపిస్తారా? లేదా? ఇంకేమైనా వెరైటీగా ప్లాన్ చేస్తున్నారా? అనేది తేలాల్సి ఉంది. 'టెంపర్ ' , 'నాన్నకు ప్రేమతో', 'జనతా గారేజ్ ' చిత్రాలతో భారీ హ్యాట్ ట్రిక్ ను అందుకున్న ఎన్టీఆర్ మళ్ళీ సరికొత్త లుక్ తో ఈ నూతన చిత్రం లో కనిపించనున్నారు.

వచ్చే ఏడాది ద్వితీయార్ధం లో:

వచ్చే ఏడాది ద్వితీయార్ధం లో:

వచ్చే సంక్రాంతి పండుగ అనంతరం చిత్రం పూజా కార్యక్రమం ఉంటుంది అని చిత్ర బృందం తెలిపింది. ఆ వెంటనే నిరవధికం గా షూటింగ్ జరుపుకుని, వచ్చే ఏడాది ద్వితీయార్ధం లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ తెలిపింది. కానీ, ఆ సినిమా కథలోని ముఖ్యాంశం ఎన్టీఆర్ ‘త్రిపాత్రాభినయం'. చేయనున్నాడనే విషయం బయటకు వచ్చేసింది. సినిమాకి ప్రాణం లాంటి కీలక అంశం ఇదే కావటం తో జూనియర్ కి చిరాకొచ్చిందట

 బాబీపై ఎన్టీఆర్ ఆగ్రహం:

బాబీపై ఎన్టీఆర్ ఆగ్రహం:


ఇప్పటికే మీడియాలో వార్తలు వస్తుండడంతో దర్శకుడు బాబీపై ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశాడట. ఇంకా సినిమా ప్రారంభం కాకుండానే కథలోని ముఖ్యాంశాలు లీక్ కావడం ఏమిటి, ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు ముందు ఎలా ఉంటుంది, కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా అంటూ బాబీపై ఎన్టీఆర్ మండిపడ్డాడట. వాస్తవానికి కథ విభిన్నంగా ఉండడమే కాక, మూడు పాత్రలు కూడా వేటికవే విభిన్నంగా ఉండడంతో ఎప్పుడెప్పుడా ఆ పాత్రల్లోకి దిగుతానా అనే ఉత్సాహంలో ఉన్నాడట ఎన్టీఆర్.

English summary
It is heard in film circles that NTR called Bobby and gave a piece of mind to him, questioning him how could the pivotal point of the film leaked in the scripting stage itself. NTR has also cautioned Bobby to keep everything under wraps as there will be huge curiosity over his three distinct characters.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu