»   » శ్రీనువైట్లపై భార్య వేధింపుల కేసు, రాజీ

శ్రీనువైట్లపై భార్య వేధింపుల కేసు, రాజీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తన భర్త వేధింపులకు గురిచేస్తున్నారంటూ ప్రముఖ సినీదర్శకుడు శ్రీనువైట్ల సతీమణి సంతోషి రూప ఈ నెల 14న అర్ధరాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదుచేసింది. తనను కొద్దిరోజులుగా వేధిస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రుల దృష్టికి కూడా తీసుకెళ్లింది.

srinu,roopa

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు శ్రీను వైట్లపై ఐపీసీ సెక్షన్‌ 498ఏ కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, రెండు రోజుల అనంతరం కేసు ఉపసంహరించుకున్నట్లు తన న్యాయవాది ద్వారా వాంగ్మూలాన్ని బంజారాహిల్స్‌ పోలీసులకు అందజేశారు. ఈ మేరకు పోలీసులు రూపను ఫోన్‌ ద్వారా సంప్రదించి విషయాన్ని నిర్ధరించుకున్నారు.


తాము కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నామని, తనకు ఎలాంటి వేధింపులు లేవని రూప స్పష్టం చేసినట్లు బంజారాహిల్స్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను కోర్టులో సమర్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.


కేసు వివరాల్లోకి వెళితే..


శ్రీనువైట్ల మానసికంగా చిత్రహింసలకు గురి చేయటంతో పాటు, భౌతిక దాడికి పాల్పిడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే వారిద్దరి మధ్య పెద్దలు రాజీ కుదిర్చినట్లు సమాచారం. దీంతో సంతోష రూప తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


srinu

రూప కాస్ట్యూమ్ డిజైనర్ గా బాద్షా చిత్రంలో కాజల్ కు, దూకుడులో సమంత కు డ్రస్ లు డిజైన్ చేసారామె. కాగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'బ్రూస్ లీ' ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

English summary
Director Sreenu Vaitla wife Santhoshi Roopa, has complained to the Banjara Hills police station that Sreenu Vaitla has been harassing her mentally.However, on October 16, Rupa, through her advocate, gave a petition to the Banjara Hills police expressing her desire to stay with her husband and wishing to to withdraw the complaint.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu