»   »  ఫ్లాప్ సెంటిమెంట్‌ను బాలయ్య బ్రేక్ చేస్తాడా?.. ఇక పూరీపైనే భారం..

ఫ్లాప్ సెంటిమెంట్‌ను బాలయ్య బ్రేక్ చేస్తాడా?.. ఇక పూరీపైనే భారం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అప్పట్లో ఎన్టీఆర్‌ నటించిన జీవితచక్రంలోని కంటి చూపు చెబుతోంది.. కొంటె నవ్వు చెబుతోంది... పాట యువతను ఉర్రూతలూగించింది. ఆ పాట ఇప్పుడు వినిపించిన మనసు హుషారెత్తుతుంటుంది. అలాంటి పాటను నందమూరి వారసుడు బాలకృష్ణ రీ మిక్స్ చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ పాటను పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వీ ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న పైసా వసూల్‌ చిత్రం కోసం రీమిక్స్‌ చేశారు. తన కెరీర్‌లో బాలయ్యబాబు చేసే తొలి పూర్తి స్థాయి రీమిక్స్‌ సాంగ్‌ ఇదే కావడం విశేషం. అయితే గతంలో పాటలు రీమిక్స్ చేసిన బాలయ్య చిత్రాలు అంతగా ప్రజాదరణ పొందకపోవడం గమనార్హం.

తండ్రి పాట తనయుడికి రీమిక్స్

తండ్రి పాట తనయుడికి రీమిక్స్

తండ్రి ఎన్టీఆర్ నటించిన పాటలో బాలకృష్ణ కనిపించడం ఇది తొలిసారి కాదు. ఎన్టీఆర్‌ నటించిన సంచలన చిత్రం జస్టిస్‌ చౌదరి సినిమాలోని ‘నీ తొలి చూపులోనే..' పాటను బాలకృష్ణ నటించిన నిప్పులాంటి మనిషిలో యథాతథంగా వాడారు. అలాగే ఎన్టీఆర్‌ ‘భలే తమ్ముడు' లోని ‘నేడే ఈ నాడే' సాంగ్‌ని ‘అల్లరి పిడుగు' కోసం రీమిక్స్‌ చేశారు. అయితే అది పూర్తి స్థాయి రీమిక్స్‌ కాదు. ఆ తర్వాత ‘ఒక్క మగాడు' కోసం ఛాలెంజ్‌ రాముడు చిత్రంలోని ‘పట్టుకో పట్టుకో పట్టుచీర' పాటలోని చరణాలను మార్చేసి, పల్లవి వాడారు. అయితే ఆ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తాపడ్డాయి.


పోర్చుగల్‌లో కంటిచూపు షూట్

పోర్చుగల్‌లో కంటిచూపు షూట్

ఇప్పుడు పైసా వసూల్‌ చిత్రం కోసం ‘కంటి చూపు చెపుతోంది...' పాటను రీమిక్స్‌ చేస్తున్నారు. డ్యాన్స్‌ మాస్టర్‌ దినేష్‌ నృత్యరీతులు సమకూర్చగా, పోర్చుగల్‌లో బాలకృష్ణ, చిత్రకథానాయికల్లో ఒకరైన ముస్కాన్‌లపై ఈ పాటను పోర్చుగల్‌లో చిత్రీకరించారు. ఆ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందనే అభిప్రాయాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలో గతంలో రీమిక్స్ చేసిన సినిమాలను దృష్టిలో పెట్టుకొంటే పైసా వసూల్ చిత్రం భిన్నంగా కనిపిస్తున్నది.


గత అపవాదును తుడిచి..

గత అపవాదును తుడిచి..

గతంలో రీమిక్స్ పాటలు ఉన్న చిత్రాలు పరాజయాలు పొందిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి.. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న పైసా వసూల్ ఆ ఫ్లాప్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తున్నది. పూరీ మేకింగ్ స్టయిల్, విభిన్న పాత్రల్లో బాలకృష్ణ నటన ఇవన్నీ ఆ అపవాదును తుడిచిపెట్టడం ఖాయంమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పూరీ, బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


హుషారైన స్టెప్పులు ఇక తెరమీద

హుషారైన స్టెప్పులు ఇక తెరమీద

ఇవన్నీ పక్కన పెడితే నటన పరంగా తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న బాలయ్య కంటిచూపు పాటకు హుషారుగా స్టెప్పులు వేసినట్టు తెలుస్తున్నది. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో రీమిక్స్ చేసిన పాట నందమూరి అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసే విధంగా చేసింది. తండ్రి పాటకు తనయుడి స్టెప్పులు ఇక తెరమీద చూడాల్సిందే.English summary
Again Balakrishna will have Remix song in for Puri Jagannadh's Paisa Vasool. Recently Senior NTR's Song Kanti Choopu Song picturised in remix version in Portugal. Many have positive feeling about this Remix Song.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu