twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగధీర వర్సెస్ ఈగ: రికార్డులపై రాజమౌళి స్పందన

    By Srikanya
    |

    రాజమౌళి తాజా చిత్రం 'ఈగ'ఘన విజయం సాదించిన దగ్గర నుంచూ...ఓ కొత్త అంశం మీడియాలో చర్చనీయాంసమైంది. అదే.. 'మగధీర' రికార్డుల్ని 'ఈగ' అధిగమిస్తుందా? అని. దీనికి రాజమౌళి కూల్ గా సమాధాన మిచ్చారు. ఆయన మాట్లాడుతూ... 'ఈగ' విడుదలైన మూడు భాషల్లో మంచి కలెక్షన్లను సాధిస్తోంది. అయితే కలెక్షన్స్ హీరోల మధ్యవార్‌లా మారాయి. ఆ వార్‌లో తలదూర్చటం నాకు ఇష్టం లేదు అన్నారు.

    ఇక 'ఈగ'తో హిట్‌కొట్టారు... మీకు ఇక హీరోలు అవసరం లేదా' అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... 'రాజమౌళికి హీరోలు అవసరం లేదు. హీరోలకి రాజమౌళి అవసరం లేదు. నా ఉద్దేశ్యంలో కథ ప్రకారమే ఒకరి అవరసం ఒకరికి వుంటుంది. సింహాద్రి, మగధీర లాంటి సబ్జెక్ట్స్‌లో హీరో ఇమేజ్ పనిచేస్తుంది. అదే 'ఈగ' విషయంలో కథే ప్రధానం. ఈ కథలో హీరోలు అవసరం లేదు' అని కేవి తెప్పారు.

    ఈగ సినిమాను... 2డి, 3డి వెర్షన్‌లో హిందీలోకి.. విడుదల చేయటంపై మాట్లాడుతూ... 'సినిమా విడుదలకు ముందే హిందీలో శాటిలైట్ రైట్స్ కోసం ఐదుకోట్ల ఆఫర్ వచ్చింది. హిందీ వెర్షన్‌ను 2డి లేదా 3డిలోకి మార్చి విడుదల చేయాలనే ఆలోచన వుంది. 3డిలోకి కన్వర్ట్ చేయాలంటే నాలుగు నెలల సమయం పడుతుంది. ఈ మధ్యనే కొన్ని బిట్స్‌ను 3డిలో రూపొంది చూశాం. అద్భుతంగా అనిపించింది. హిందీ వెర్షన్ గురించి త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తాను' అని తెలిపారు.

    తన తదుపరి చిత్రం గురించి రాజమౌళి వివరిస్తూ... 'ప్రస్తుతం 'ఈగ'విజయాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నాను. కొద్దిరోజలు తర్వాతే తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తాను. తొమ్మిది సినిమాలు సక్సెస్ అయ్యాయని నేనెప్పుడు గర్వంగా ఫీలవ్వను. నా పదో సినిమాను కూడా మొదటి చిత్రంగా భావించి పనిచేస్తాను. నేనిప్పుడు ఈగలాగా రెండు రెక్కలతో గాల్లో ఆనంద విహారం చేస్తున్నాను. కిందకు దిగాకే తదుపరి సినిమాపై దృషి కేంద్రీకరిస్తాను' అన్నారు.

    English summary
    Rajamouli says that he don't want to put his head in to Collection war. He says his eega collects record breaking collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X