»   » ఆ సినిమా టార్గెట్ రూ. 300 కోట్లు, చిరంజీవితో లింక్!

ఆ సినిమా టార్గెట్ రూ. 300 కోట్లు, చిరంజీవితో లింక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'జై హో' చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. వరల్డ్ వైడ్‌గా 5000 పైచిలుకు స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసారు. విడుదలకు ముందు నుండే మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం తప్పకుండా 300 కోట్లు వసూలు చేసిన క్లబ్బులో చేరడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్.

చిరంజీవి తెలుగులో నటించిన 'స్టాలిన్' చిత్రానికి ఇది రీమేక్ కావడంతో ఏపీలో విడుదలయ్యే హిందీ వెర్షన్‌కు మంచి స్పందన వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు. తొలుత ఈచిత్రానికి మెంటల్ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ సూచన మేరకు 'జై హో'గా మార్చారు.

Will 'Jai Ho' crack Rs.300 crore code?

జై హో చిత్రం ఒక మంచి సోషల్ మెసేజ్‌తో తెరెక్కింది. రిపబ్లిక్ డే సందర్బంగా విడుదలైన ఈ చిత్రంలో ప్రజల్లో దేశభక్తి పెంచేలా ఎన్నో సన్నివేశాలున్నాయి. ఈ సినిమా తర్వాత తన స్టార్ ఇమేజ్ రెట్టింపు అవుతుందని సల్మాన్ భావిస్తున్నాడు. ఈచిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన డైసీ షా నటించింది.

ఇంతకు ముందు సల్మాన్ నటించిన చివరి ఐదు సినిమాలు దబాంగ్, రెడీ, బాడీగార్డ్, ఏక్ థా టైగర్, దబాంగ్ 2 చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ ఓపెన్సింగ్ సాధించడంతో పాటు......సల్మాన్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో 'జై మో' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

English summary
The stage is set for Salman Khan's "Jai Ho", his first release of the year. Trade analyst Taran Adarsh is confident that it will cross the Rs.300-crore-mark while Amod Mehra says though a bumper opening is assured, reaching Rs.200 crore could be "a Herculean task". Directed by Salman's brother Sohail, the film that focuses on corruption will hit more than 5,000 screens Friday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu