»   » మహేశ్‌కు కొత్త కష్టాలు.. నిర్మాతలకు డబ్బులు వాపస్..

మహేశ్‌కు కొత్త కష్టాలు.. నిర్మాతలకు డబ్బులు వాపస్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీమంతుడు లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఇక ప్రిన్స్ మహేశ్ బాబుకు ఎదురే ఉండదని భావించారు. టాలీవుడ్‌లో నంబర్ వన్ కిరీటం దక్కించుకొనే అవకాశాలు మహేశ్‌కే సాధ్యమనే మాటలు వినిపించాయి. ఎందుకంటే పవన్ కల్యాణ్‌ రాజకీయాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో మహేశ్‌కే ఆ ఛాన్స్ ఉందనే మాటలు వినిపించాయి. అయితే బ్రహ్మోత్సవం, తాజాగా స్పైడర్ కొట్టిన దెబ్బకు మహేశ్‌కు అనేక కష్టాలు మొదలయ్యాయనే మాటలు వినిపిస్తున్నాయి.

20 కోట్లకు పైగా రెమ్యునరేషన్

20 కోట్లకు పైగా రెమ్యునరేషన్

టాలీవుడ్‌లో 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకొనే హీరోలు ఇద్దరే ఇద్దరు. అందులో ఒకరు పవన్ కల్యాణ్ కాగా, మరొకరు మహేశ్. వీరిద్దరి సక్సెస్ రేటు ఈ మధ్యకాలంలో అంతంత మాత్రమే. పవన్ కల్యాణ్‌కు సినిమా ఫ్లాప్ అయితే పెద్దగా వచ్చే నష్టం ఏమీ ఉండదని వాస్తవం.


 ప్రిన్స్ మహేశ్ ఓ బ్రాండ్

ప్రిన్స్ మహేశ్ ఓ బ్రాండ్

తన సినిమాలు ఫ్లాప్ అయితే మహేశ్‌కు ఇబ్బందే ఉంటుంది. ఎందుకంటే అడ్వర్టయిజింగ్ రంగంలో ప్రిన్స్ మహేశ్ ఓ బ్రాండ్. అతను వెనుక అనేక బ్రాండ్స్ ఉన్నాయి. సినిమాలు ఫ్లాప్ అయితే యాడ్స్ ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.


ఆదాయం పెరగడామా? తగ్గడమా?

ఆదాయం పెరగడామా? తగ్గడమా?

మహేశ్ సక్సెస్ రేటు ప్రకారమే ఆదాయం పెరగడామా? తగ్గడమా అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే అత్యధిక సంపన్నుల జాబితాను వెల్లడించే ఫోర్బ్స్ లిస్టులో ఉన్న వారిలో మహేశ్ ఒకరు. గత మూడేళ్ల ఫోర్బ్స్ జాబితాను పరిశీలిస్తే మహేశ్ రికార్డు బ్రహ్మండంగా ఉంది. అయితే ఈ సారి సినిమాల ఫ్లాప్ వలన ఇలాంటి అంశాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడే చెప్పలేం.


 కెరీర్ ఎగుడుదిగుడుగా

కెరీర్ ఎగుడుదిగుడుగా

2014 నుంచి మహేశ్ కెరీర్ ఎగుడుదిగుడుగా ఉంటున్నది. ఆగడుకు ముందు కెరీర్ గ్రాఫ్ మంచి రైజింగ్‌లో ఉండేది. ఆ సమయంలో మహేశ్ రెమ్యునరేషన్ భారీగా ఉండేది. ఆగడు సినిమా ఫెయిల్యూర్ తర్వాత తీసుకొన్న రెమ్యునరేషన్ నుంచి నిర్మాతలకు కొంత వాపసు చేశారనేది ఇండస్ట్రీలో టాక్.


 శ్రీమంతుడు బ్లాక్ బస్టర్‌గా నిలువడంతో

శ్రీమంతుడు బ్లాక్ బస్టర్‌గా నిలువడంతో

ఆ తర్వాత శ్రీమంతుడు బ్లాక్ బస్టర్‌గా నిలువడంతో మళ్లీ మహేశ్ ఓ రేంజ్‌కు వచ్చాడు. కానీ వెంటనే బ్రహ్మొత్సవం దెబ్బ తీసింది. దాంతో సుమారు 5 కోట్ల మొత్తం తిరిగి ఇచ్చినట్టు సమాచారం. తాజాగా స్పైడర్‌ కారణంగా తీసుకొన్న రెమ్యునరేషన్‌లో నుంచి కొంత వెనక్కు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందనే వార్త ప్రస్తుతం ప్రచారంలో ఉంది.


 హిట్ల మీద హిట్లు కొట్టినంత

హిట్ల మీద హిట్లు కొట్టినంత

సూపర్ స్టార్లుగా హిట్ల మీద హిట్లు కొట్టినంత వరకు వారి చుట్టు లెక్కకు లేనంత మంది జమా అవుతారు. ఒకట్రెండు ఫెయిల్యూర్స్ వచ్చాయంటే హీరోలపై ప్రచారం జరిగే చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రజనీకాంత్‌ లాంటి వారికే తప్పలేదు. కాబట్టి ఏదైనా మ్యాజిక్ చేయాలంటే సక్సెస్ మాత్రమే ఉపయోగపడుతుందనేది జీవిత సత్యం.


English summary
Prince Mahesh Babu do not have positive way After Brohmotsavam, Spyder sunk. His career graph is under pressure present situation. In this event, reports suggest that his brand Image may affected after Spyder failure. Generally, he charges a huge price, he has also been giving back to his producers when his films have failed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X