»   » మళ్ళీ సేమ్ సీన్ రిపీట్... ఈసారి మహేష్ బాబు ఏం చేస్తాడు ? మళ్ళీ త్యాగమేనా

మళ్ళీ సేమ్ సీన్ రిపీట్... ఈసారి మహేష్ బాబు ఏం చేస్తాడు ? మళ్ళీ త్యాగమేనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

పోయిన సంవత్సరం బాహుబలి వచ్చిన సమయం లో శ్రీమంతుడు కూడా వచ్చింది. రాజమౌళి మీద గౌరవంతోనో మరేకారనమో గానీ కొన్నాళ్ళు లేట్గానే రిలీజ్ చేసారు. అప్పటికీ బాహుబలి ప్రభావం ఇంకా తగ్గలేదు. సినిమా సూపర్ డూపర్ హిట్ అని కంఫార్మ్ అయ్యాకే శ్రీమతుడూ రిలీజ్ అయ్యింది. ఈ విషయంలో హిపోక్రసీలకు చోటు లేకుండా 'బాహుబలి'కి దారివ్వడానికే తన సినిమాను వాయిదా వేసుకున్నట్లు బహిరంగం గానే చెప్పాడు మహేష్ బాబు.

అంతర్జాతీయంగా వార్తల్లోకెక్కిన చిత్రం తో పోటీపడి మరీ ఒక ప్రాంతీయ భాషలోనే ఒక రికార్డ్ స్థాయి వసూళ్లని సాధించటమే కాదు. లోకల్ సినిమా ఏమాత్రం తక్కువకాదనీ, మేసేజ్ ఉన్న సినిమాలు అవార్డులే కాదు లాభాలనూ తెచ్చిపెట్టగలవు అని నిరూపించింది. అయితే ఆతర్వాత మాత్రం బ్రహ్మోత్సవం దారునం గా దెబ్బతీసింది... ఇదే గనక బాహుబలి సమయం లో అయిఉంటే మహేష్ కి పెద్ద భాద ఉండేది కాదేమో కానీ ఏస్టార్ సినిమాలూ లేని సమయం లో కూడా భయంకరమైన ఫ్లాప్ పలకరించింది. అందుకే మరింత కసిగా తన రాబోయే సినిమా మీద దృష్టి పెట్టాడు మహేష్.

Will Mahesh Babu sacrifice once again by postponing his movie

అది అక్కడితోనే అయిపోలేదు ఇప్పుడు వచ్చే ఏడాది కూడా మళ్లీ మహేష్ సినిమాకు మళ్లీ 'బాహుబలి'తో పోటీ పడాల్సిన పరిస్థితి తలెత్తింది. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న కొత్త సినిమా రిలీజ్ డేట్ ఏప్రిల్ 14 అనుకుంటున్నారు. ఐతే అదే నెల 28న 'బాహుబలి-2' రాబోతోంది. ఐతే 'శ్రీమంతుడు' విషయంలో వెనక్కి తగ్గినట్లు మహేష్ ఈసారి తగ్గే అవకాశాలు లేవట. రెండు వారాల గ్యాప్ సరిపోతుందని.

అందులోనూ ఏప్రిల్ 14న తమిళ సంవత్సరాది కావడంతో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆ తేదీకే రిలీజ్ చేసేయాలని ఫిక్సయ్యారట. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మెజారిటీ పార్ట్ పూర్తయింది. జనవరి నెలాఖరుకల్లా సినిమా పూర్తయిపోతుందని.. ఇంకో రెండున్నర నెలల్లో నెమ్మదిగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి అనుకున్న ప్రకారం సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలన్న ప్రణాళికతో ముందుకెళ్తోందట ఈ మూవీ టీం.

English summary
Will Mahesh Babu sacrifice once again by postponing his movie for two weeks to free run of Baahubali 2 or force his makers to release on scheduled date?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu