»   » అమీర్‌ఖాన్ మూడో పెళ్లి.. అంటూ సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

అమీర్‌ఖాన్ మూడో పెళ్లి.. అంటూ సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎవరేమనుకుంటారో అనే భయం లేకుండా తోటి హీరోలపై సెటైర్లు విసరడంలో సల్మాన్ ఖాన్‌ది డిఫరెంట్ స్టయిల్. అలా బాలీవుడ్‌ హీరోలోపై గతంలో వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా తన పెళ్లి గురించి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానిమిస్తూ అమీర్‌ఖాన్ మూడో పెళ్లి చేసుకోరనే గ్యారంటీ ఏమైనా ఉందా అని ప్రశ్నించడంతో సమావేశం గందరగోళంగా మారింది. సల్మాన్ చేసిన వ్యాఖ్యలకు అమీర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. అసలు సల్మాన్ వ్యాఖ్యలు చేయడానికి అసలు కారణమేమిటంటే..

చేతులు, కాళ్లు కట్టి..

చేతులు, కాళ్లు కట్టి..

ఇటీవల అమీర్ ఖాన్ పాల్గొన్న ఓ మీడియా సమావేశంలో సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రస్తావన వచ్చింది. దానిపై అమీర్ ఖాన్ స్పందిస్తూ సల్మాన్ కాళ్లు, చేతులు కట్టి పెళ్లి జరిపిస్తాను అని అన్నారు. అమీర్ ఖాన్ వ్యాఖ్యలను తాజాగా ఓ రిపోర్టర్ సల్మాన్ దృష్టికి తీసుకొచ్చారు. దానిపై సల్లూభాయ్ స్పందిస్తూ అమీర్ చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి కూడా వచ్చాయి. వాటిని ఎక్కడో చదివానో.. లేదా విన్నానో సరిగా గుర్తు లేదు అని పేర్కొన్నారు.

మూడో పెళ్లి చేసుకోరనే గ్యారెంటీ..

మూడో పెళ్లి చేసుకోరనే గ్యారెంటీ..

కాళ్లు, చేతులు కట్టివేసి నా పెళ్లి జరిపిస్తానని అమీర్ అన్నాడు. అది సరే.. అమీర్ అలాంటి వ్యాఖ్యలు చేయడంలో తప్పులేదు. అతను నాకు మంచి మిత్రుడు. నా మంచి కోరుకోవడంపై సంతోషంగా ఉంది అని చెప్తునే ఓ సైటెర్ వదిలాడు. అమీర్ గురించి నాకు ఓ భయం ఉంది. ఆయన మూడో పెళ్లి చేసుకోరనే గ్యారెంటీ ఏమున్నది. అలా చేయకుండా ఆయన చేతులు, కాళ్లు నేను కట్టివేస్తాను అని సల్మాన్ తనదైన శైలిలో స్పందించారు.

అమీర్ మూడో పెళ్లిపై..

అమీర్ మూడో పెళ్లిపై..

దీంతో అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోనున్నారా? చేసుకొనే ఆలోచనలో ఉన్నారా? లేకపోతే సల్మాన్ ఎందుకు అలా అంటారు అనే ప్రశ్న ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. లగాన్ చిత్రం తర్వాత తన సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేసిన కిరణ్ రావును అమీర్ పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే.

కిరణ్ రావుతో రెండో పెళ్లి..

కిరణ్ రావుతో రెండో పెళ్లి..

హీరోగా గుర్తింపు తెచ్చిన ఖయామత్ సే ఖయామత్ తక్ చిత్రంలో చిన్న పాత్ర పోషించిన రీనా దత్‌ను 1986లో అమీర్ ఖాన్‌ వివాహం చేసుకొన్నాడు. వారికి జునైద్, ఇరాఖాన్ ఇద్దరు సంతానం. ఆ తర్వాత వ్యక్తిగత విభేదాలు తలెత్తడంతో 2002లో విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత లగాన్ అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్ రావును పెళ్లి చేసుకొన్నాడు. వారికి సరోగసి ద్వారా పట్టిన బిడ్డకు అజాద్ రావు ఖాన్ అని పేరుపెట్టుకొన్నారు.

English summary
Salman Khan always speaks his heart. In fact, he not only impresses the audiences with his one-liners, but is capable enough to leave the entire auditorium laughing their heads out. Amair Khan said in a recent interview that he would tie Salman's hands and feet to get him married. A journalist informed Salman about Aamir’s statement, Salman bowled us over with a rather interesting response. He said, "Yes, I have read somewhere that Aamir wants to make me get married and is read to tie my hands and feet. I can only retort that I have also decided to tie his hands and feet to see to it that he does not get married a third time in his life."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu