»   »  బాలయ్యకు ప్రియాంక 'యస్' చెప్తుందా?

బాలయ్యకు ప్రియాంక 'యస్' చెప్తుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Priyanka Chopra
బాలకృష్ణ హీరోగా త్వరలో రూపొందనున్న కొత్త చిత్రంలో ప్రియాంకా చోప్రా నటించనుందనే వార్తలు అంతటా వినపడుతున్నాయి. దాదాపు ప్రతీ సినిమాకీ హీరోయిన్స్ ని కొత్త వాళ్ళని తీసుకునే బాలయ్య విషయంలో ఇది నిజమే అవటానికి ఆస్కారం ఉందని కొందరి వాదం. అయితే ప్రియాంకా చోప్రా ప్రస్తుంతో బాలీవుడ్ లో బిజీ హీరోయిన్. లవ్ స్టోరీ 2050,గాడ్ తూస్సీ గ్రేట్ హొ,చమకు భాక్సాఫీస్ వద్ద భోల్తా కొట్టినా ఆమె ఆఫర్స్ కి లోటు లేదు. అందులోనూ ఆమె చేసేవన్నీ అల్లాటప్పావి కాదు. పెద్ద బ్యానర్స్ ...పెద్ద హీరోలు . తాజాగా ఆమె మధూర్ భండార్కర్ ఫ్యాషన్,కరణ్ జోహార్ దోస్తానా పూర్తి చేసింది.

ఇక పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ద్రోణ ఇప్పటికే ప్రొమోలతో అదరకొడుతోంది. భారీ గ్రాఫిక్స్ తో భారీ బడ్జెట్ తో తయారవుతున్న ఈ సినిమా హిట్టయితే ఆమె కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోతుందని బాలీవుడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఖర్భనీ ప్రస్తతం ప్రొడక్షన్ లో ఉంది. అందులో షీలా పాత్ర పై చాలా ఆశలే ఉన్నాయి. అలాగే కామ్నే,వాట్ ఈజ్ యువర్ రాసి ప్రి ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఇలా డైరీ పూర్తిగా ఉన్న స్ధితిలో ఆమె సౌత్ సినిమాలో చేస్తుందా అనేది ఆలోచించాల్సిన విషయం. అంతేగాక అక్కడ ఆమెకు లభించే పారితోషికంతో ఇక్కడ ఓ సినిమా లాగించేయవచ్చు. అందుకే ఆమె బాలయ్యతో చేస్తుందీ అనేది చాలా కష్టంగా నమ్మాల్సిన విషయం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X