»   » ‘రేసు గుర్రం’ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం: సురేందర్ రెడ్డి

‘రేసు గుర్రం’ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం: సురేందర్ రెడ్డి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కిక్ సినిమాకు సీక్వెల్ గా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘కిక్-2' ఇటీవల విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఊహించిన ఫలితాలను రాబట్టలేదు. మిక్డ్స్ రివ్యూలు, మిక్డ్స్ టాక్ వల్ల సినిమా కాస్త డీలా పడింది. అయితే ఈ సినిమా ఫలితం తనకు సంతృప్తిని ఇచ్చిందని అంటున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. త్వరలో ‘రేసు గుర్రం' చిత్రానికి సీక్వెల్ తీయబోతున్నట్లు ప్రకటించారు.

‘అల్లు అర్జున్‌తో ‘రేసుగుర్రం 2' చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాను. దీంతో పాటు కిక్-3 చేయాలనే ఆలోచన కూడా ఉంది. ఈ సినిమాలకు స్టోరీ డిఫరెంటుగా ఉంటుంది. ఈ రెండు ఫ్రాంచైజీలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతాయని ఆశిస్తున్నట్లు సురేందర్ రెడ్డి వెల్లడించారు. ‘రేసు గుర్రం' చిత్రం 2014లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే.

Will Soon Work On 'Race Gurram' Sequel: Surender Reddy

‘కిక్-2' సినిమాకు వస్తున్న రెస్పాన్స్ గురించి వెల్లడిస్తూ...‘ఆడియన్స్ కిక్-2 సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రివ్యూలు ఎలా ఉన్న స్పందన బావుంది. ఓపెనింగ్ వీకెండ్ లో వసూళ్లు బావున్నాయి' అన్నారు.

‘కిక్-2' సినిమా ఓపెనింగ్ వీకెండ్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 21.45 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

English summary
"I'm planning to work on 'Race Gurram 2' with Allu Arjun. I also have plans to make 'Kick 3'. The stories of these films appealed to the audiences so much that I feel that the franchise can be extended," Surender Reddy told IANS.
Please Wait while comments are loading...