»   » పవన్ కళ్యాణ్ కోసం అన్ని సినిమాలు ఆపేస్తా: నితిన్

పవన్ కళ్యాణ్ కోసం అన్ని సినిమాలు ఆపేస్తా: నితిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద తనకు ఎంతో అభిమానం ఉందో మరోసారి తన వ్యాఖ్యల ద్వారా నిరూపించాడు యంగ్ స్టార్ నితిన్. నితిన్ తొలిసారి నిర్మాతగా మారి నిర్మిస్తున్న చిత్రం ‘అఖిల్'. ఈ సినిమా ద్వారా అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా ఆడియో లాంచ్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరుగుతుందనే రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి.

ఈ వార్తల విషయమై నితిన్ స్పందిస్తూ...‘అఖిల్' ఆడియో రిలీజ్ విషయంలో ఇంకా ఏది ఫైనలైజ్ కాలేదు. గెస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నామని తెలిపారు. ఏఎన్ఆర్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20న ‘అఖిల్' మూవీ ఆడియో వేడుక అభిమానుల మధ్య భారీగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా నితిన్ సినిమా నిర్మిస్తున్నాడనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. దీనిపై నితిన్ స్పందిస్తూ... పవన్ కళ్యాణ్ తో పని చేసే అవకాశం వస్తే...ఎంత ఖర్చయినా దక్కించుకుంటాను. నా సినిమాలు అన్ని స్టాప్ చేసి ఆ సినిమాను నిర్మిస్తాను' అని నితిన్ వెల్లడించారు.

‘కొరియర్ బాయ్ కళ్యాణ్' సినిమా విడుదల సందర్భంగా వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న నేపథ్యంలో నితిన్ ఈ వ్యాఖ్యలు చేసారు. సెప్టెంబర్‌ 17న ఈ చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా ఈ చిత్రం U/A సర్టిఫికెట్ పొందింది.

Will Stop Everything For Pawan Kalyan, Says Nithin

రొమాన్స్‌, యాక్షన్‌, కామెడి, థ్రిల్లర్‌ అంశాలు మేళవించిన చిత్ర మిది. సాధారాణ కొరియర్‌ బాయ్‌గా పని చేసే ఒక యువకుడి జీవితంలో ఎదురైన అనుహ్య సంఘటనలు, వాటి పరిణామాలేమిటి? సవాళ్లను అధిగమించే క్రమంలో అతడు ఎలాంటి పోరాటాన్ని సాగించాడు? అన్నదే చిత్ర ఇతివృతం.

నితిన్ సరసన యామి గౌతమ్ నటిస్తోంది. అశుతోష్ రాణా, నాజర్, సత్యం రాజేష్, సప్తగిరి, హర్ష వర్ణన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, అనూప్ రూబెన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్: సందీప్ చౌతా, సినిమాటోగ్రఫీ: సత్య పొన్ మార్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: రాజీవన్, యాక్షన్: విజయ్, దిలీప్ సుబ్బరాయన్, సాహిత్యం: అనంత శ్రీరామ్, భాస్కరభట్ల, సాహితి, శ్రేష్ఠ, కొరియోగ్రాఫర్: శేఖర్, విష్ణు దేవా, రచనా సహకారం: కోన వెంకట్, హర్ష వర్ధన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: స్వాతి రఘురామన్, విజయ్ శంకర్.

English summary
Talking about the reports that read Nithin is eyeing to produce a film with Pawan Kalyan, "If at all there is any chance to work with Pawan, I'll grab it under any cost. Will stop all my films and produce it", the actor stated.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu