బ్రహ్మానందం ఇక ‘హాస్యనట బ్రహ్మ’.. పాలిటిక్స్‌కు సంబంధం లేదు..

By Rajababu

Recommended Video

'హాస్యనట బ్రహ్మ' పురస్కార కార్యక్రమంలో నో పాలిటిక్స్‌ ?

మహబూబ్ నగర్ లో వైభవంగా జరిగిన డా:టి. సుబ్బరామిరెడ్డి కాకతీయ లలితా కళాపరిషత్, కాకతీయ కళా వైభవ మహోత్సవం వేడుక కాకతీయ కళావైభవానికి రాజకీయంతో సంబంధం లేదని, కళలను ప్రోత్సహించేందుకే దానిని ఏర్పాటు చేసినట్లు కాకతీయ లలిత కళా పరిషత్‌ ఛైర్మన్‌ టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందానికి 'హాస్యనట బ్రహ్మ' పురస్కార ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.

సార్థక నామధేయుడు..

సార్థక నామధేయుడు..

హాస్యనటుడు బ్రహ్మనందం సార్థక నామధేయుడని, ఆయన పేరులోనే ఆనందం ఉందని తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి పేర్కొన్నారు. యావత్‌ జాతికి హాస్యాన్ని పంచుతున్న మహానటుడని కొనియాడారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం రాత్రి టీఎస్‌ఆర్‌ కాకతీయ లలితా కళాపరిషత్‌ ఆధ్వర్యంలో కాకతీయ కళా వైభవ మహోత్సవం నిర్వహించారు. 1100 చిత్రాలు పూర్తి చేసుకున్న బ్రహ్మానందంకు సంస్థ ఆధ్వర్యంలో ‘హాస్యనటబ్రహ్మ' బిరుదును ప్రదానం చేశారు.

బ్రహ్మానందానికి బంగారు కంకణం

బ్రహ్మానందానికి బంగారు కంకణం

బ్రహ్మానందం చేతికి మధుసూధనాచారి బంగారు కంకణం తొడిగి వీణను, జ్ఞాపికను బహూకరించారు. సభాపతి మాట్లాడుతూ.. కాకతీయ కళా వైభవం కార్యక్రమాల ద్వారా కాకతీయుల కీర్తిని విశ్వవ్యాప్తం చేయడానికి సుబ్బరామిరెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. బ్రహ్మానందం, కార్యక్రమ నిర్వాహకుడు, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి జిల్లాలో కాకతీయ కళా వైభోత్సవాలు నిర్వహిస్తానన్నారు.

తెలుగువారి సత్తాను

తెలుగువారి సత్తాను

ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగువారి సత్తా శక్తిని అందరికీ తెలియజేస్తానని, తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లోనూ కాకతీయ కళావైభవోత్సవాన్ని నిర్వహిస్తానని అన్నారు. బ్రహ్మానందం నటనకు జీవం పోస్తారని, ఆయన ఓ జీనియస్‌ నటుడని కితాబిచ్చారు. 1100 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించిన గొప్ప నటుడని పేర్కొన్నారు.

కళను ఈశ్వరశక్తిగా భావించాలి

కళను ఈశ్వరశక్తిగా భావించాలి

ఎంపీ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ కళ ఈశ్వరశక్తిగా భావించాలన్నారు. 700 ఏళ్ల క్రితం ఇక్కడ కాకతీయ వైభవం సాగింది. తెలుగుజాతి కళావైభవాన్ని మహోన్నతస్థాయికి తీసుకపోయిన మహానీయులు కాకతీయులు అని కొనియాడారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ బ్రహ్మానందం నటనా ప్రతిభకు పాలమూరులో సన్మానించటం మరువలేని అనుభూతిగా అభివర్ణించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X