»   » రక్తచరిత్ర హీరోతో నరేంద్ర మోడీపై సినిమా?

రక్తచరిత్ర హీరోతో నరేంద్ర మోడీపై సినిమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల ప్రధాని అభ్యర్థి ఇప్పుడు దేశంలోని యువతకు రోల్ మోడల్. ముక్కుసూటిగా మాట్లాడే మోడీ సామాన్యుడిగా జీవితం మొదలుపెట్టి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. అయితే ఇప్పుడు మోడీ నేపథ్యాన్ని కథా వస్తువుగా తీసుకుని సినిమా తీసేందుకు రంగం సిద్దం చేశారు.

ఈ నేపథ్యంలో రూ.40 కోట్ల బడ్జెట్‌తో మితేష్ పటేల్ అనే యువకుడు మోడీ జీవితంపై సినిమా తీయాలని భావిస్తున్నాడు. ఎవరినీ తాను లక్ష్యంగా చేసుకుని ఈ సినిమా తీయడం లేదని, తన ప్రయత్నానికి మోడీ ఓకె చెప్పారని, నటీనటులు, లొకేషన్లకోసం వెతుకుతున్నామని తెలిపారు.

Will Vivek Oberoi play Narendra Modi onscreen

బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మోడీగా పాత్రలో నటుడు వివేక్ ఒబెరాయ్ సెలక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు. వివేక్ ఒబెరాయ్ తెలుగులో 'రక్త చరిత్ర' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ సాధించిన అనన్య సామాన్యమయిన అభివృద్ది దేశం మొత్తం ఆయనవైపు చూసేలా చేసింది. పదిహేనేళ్లలో గుజరాత్ ను అన్ని రంగాలలో అభివృద్దిపథాన నిలిపి దేశంలోని మిగిలిన ముఖ్యమంత్రులకు మోడీ ఆదర్శంగా నిలిచాడు. ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రధాన అడ్డంకి మోడీ. బీజేపీ ప్రచార బాధ్యతలు ఎత్తుకున్న మోడీ 2014 ప్రధానిగా యువత భావిస్తున్నారు.

English summary
Filmmaker Mitesh Kumar Patel's upcoming film is based on the life of Gujarat Chief Minister Narendra Modi. Mitesh Kumar has approached Vivek Oberoi to play the younger version of the minister on the big screen.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu