»   » ‘దృశ్యం’తో సురేష్ ప్రొడక్షన్స్ 50 ఏళ్ల పండగ

‘దృశ్యం’తో సురేష్ ప్రొడక్షన్స్ 50 ఏళ్ల పండగ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సురేష్ ప్రొడక్షన్స్ తెరకెక్కించిన 'దృశ్యం' సినిమా విడుదల సందర్భంగా నిర్మాత సురేష్ బాబు కళ్లలో కొత్త ఆనందం కనిపిస్తోంది. అందుకు కారణం ఈ సినిమాతో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగు సినిమా పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడమే. తమ సంస్థ చారిత్రాత్మక మైలు రాయిని అందుకోవడంపై సురేష్ బాబు సంతోషం వ్యక్తం చేసారు.

'దృశ్యం సినిమాతో మేము 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాం. పరిశ్రమలో విజయవంతంగా సంస్థ సుదీర్ఘ ప్రయాణం సాగించడం ఆనందం గా ఉంది. ఈ సుధీర్ఘ ప్రయాణం ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో మరిన్ని మంచి ప్రాజెక్టులతో ముందుకు సాగుతాం' అని నిర్మాత సురేష్ తెలిపారు.

With 'Drishyam' we celebrate 50 years in production: Suresh

సురేష్ ప్రొడక్షన్స్ వైవిధ్య సినిమాల నిర్మాణానికి కేరాఫ్ గా నిలిచిన సంస్థ. ఆనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి నిన్నటి వెంకటేష్, చిరంజీవి, నేటి కుర్రహీరోల వరకు మూడు తరాల హీరోలతో సినిమాలు చేసిన నిర్మాణ సంస్థ. తెలుగులో దాదాపు అందరు హీరోలతో సోలో, మల్టీస్టారర్ సినిమాలు నిర్మించిన ఈ సంస్థ అత్యధిక సక్సెస్ రేటుతో టాలీవుడ్ కీర్తిని పతాక స్థాయికి తీసుకెళ్లింది.

'దృశ్యం' సినిమా విషయానికొస్తే...మళయాళంలో సూపర్‌హిట్ అయిన 'దృశ్యం' సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమా ఈనెల 11న విడుదల కానుంది. ఈ చిత్రంలో వెంకటేష్, మీనా జంటగా నటించారు. డి.రామానాయుడు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్ ప్రై.లిమిటెడ్, రాజ్ కుమార్ థియేటర్స్ ప్రై.లిమిటెడ్ పతాకాలపై సీనియర్ హీరోయిన్ శ్రీప్రియ దర్వకత్వంలో డి.సురేష్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

English summary
Producer Suresh Babu is extremely thrilled that his forthcoming Telugu thriller "Drishyam" will mark 50 years of their production house. He says he would continue to back path breaking films under his banner Suresh Productions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu