»   » 150: డిస్క్రషన్స్ షురూ, మెగాస్టార్ తో దేవిశ్రీ సెల్ఫీ

150: డిస్క్రషన్స్ షురూ, మెగాస్టార్ తో దేవిశ్రీ సెల్ఫీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై విషయంలో అనుమానాలు పటాపంచలయ్యాయి. ఇటీవల ఈ సినిమా లాంచనంగా ప్రారంభం అయినా.... సినిమా కథ విషయంలో కోర్టు వివాదం ఉందని, దేవిశ్రీ ప్రసాద్ బాలయ్య సినిమాతో బిజీగా ఉండటం వల్ల మరింత సమయం అడుగుతున్నాడు. సినిమా ఇంకాస్త లేటయ్యే అవకాశం ఉందంటూ కొన్ని రూమర్స్ వినిపించాయి.

అలాంటిదేమీ లేదని, ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం అయ్యాయని స్పష్టమైంది. ఈ మేరకు దేవిశ్రీ ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవితో దిగిన సెల్ఫీని పోస్టు చేసాడు. బాస్ చిరంజీవితో 150వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ డే డిస్క్రషన్స్ మొదలయ్యాయి అంటూ దేవిశ్రీ పేర్కొన్నారు.

చిరు, దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్ మరోసారి ఈ సినిమాతో రిపీట్ కాబోతున్న నేపథ్యంలో దేవీ చిరును కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన సెల్ఫీని అభిమానులతో షేర్ చేసుకున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 150వ సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ ఖరారయిన తర్వాత హీరోయిన్ ఎవరనే విషయమై ఓ క్లారిటీ వస్తుంది.

తమిళంలో సూపర్ హిట్టయిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మార్పులు, చేర్పులు చేసారు. చిరంజీవి కెరీర్లో ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ఈ సినిమా కోసం రామ్ చరణ్ నిర్మాత అవతారం ఎత్తాడు. 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ' స్థాపించారు.

ప్రస్తుతం చిరంజీవి సినిమాలో పాత్రకు తగిన విధంగా సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆయన బరువు తగ్గేందుకు నిపుణుల సమక్షంలో కసరత్తులు చేస్తున్నారు. జూన్ నెలలో సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

English summary
"With the BOSS !! #Megastar150 !! On d 1st day of discussions !! WELCOME bak Sirrrr !!! We Love You !!" DEVI SRI PRASAD tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu