»   » అసభ్యంగా ‌:ప్రముఖ గాయకుడు పై మహిళ పోలీస్ కేసు

అసభ్యంగా ‌:ప్రముఖ గాయకుడు పై మహిళ పోలీస్ కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు అభిజిత్‌ భట్టాచార్యపై ముంబైలోని ఆశివర పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే... విజయ దశమి పండగ సందర్భంగా లోకంద్‌వాలా దుర్గా పూజ సమితి ఆధ్వర్యంలో గురవారం రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు కైలాష్‌ కెహర్‌ వేదికపై పాటలు ఆలపిస్తున్నారు. జనం ఎక్కువగా ఉండటం ఓ మహిళ ఆ కార్యక్రమాన్ని వీక్షించడానికి నిల్చొంది. ఈ క్రమంలో నిర్వాహకుల్లో ఒకరైన అభిజిత్‌ అటుగా వెళ్తున్నప్పుడు ఆమె చేయి తగిలింది. దీంతో ఆగ్రహించిన మహిళ అభిజిత్‌తో వాగ్వాదానికి దిగింది. అనంతరం అభిజిత్‌పై స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

అంధేరికి కు చెందిన తాను ఈ పోగ్రామ్ చూడటానికి వచ్చానని, తాను నిలబడినప్పుడు కావాలని అభిజిత్ తాకరాని చోట్ల తాకాడని అన్నారు. తర్వాత అభిజిత్ చేసిన పనని అక్కడ తప్పు పట్టగా..తనపై ఆ సింగర్ పబ్లిక్ గా అరిచాడని, ఉమెన్ వాలంటీర్లతో తనను అక్కడ నుంచి తీసుకు వెళ్లపొమ్మని చెప్పాడని, ఆ తర్వాత తనను చాలా ఇబ్బంది పెట్టేప్రయత్నం చేసాడని, వాలంటీర్ల చేత తనను బయిటకు తోసేయించాడని ఆమె చెప్పారు.

Woman accuses singer Abhijeet Bhattacharya of molestation at Puja Pandal

కొద్ది కాలం క్రితం... సల్మాన్ ఖాన్ కేసు విషయంలో సింగర్ అభిజిత్ తన ట్విట్టర్‌లో ‘‘రోడ్లమీద పడుకునేది కుక్కలు తప్ప మనుషులు కాదు... అలా పడుకునే వారు కుక్కచావే చస్తారు. ఇళ్లు లేనంత మాత్రాన రోడ్లమీద పడుకోకూడదు'' అంటూ అభిజిత్‌ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.

ఫుట్ పాత్ ప్రమాద ఘటనలకు మద్యాన్ని కూడా కారణంగా చూపలేమని అభిప్రాయపడ్డారు. ఈ ట్వీట్‌తో దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. అభిజిత్‌ వ్యాఖ్యలపై కేసు కూడా నమోదు అయింది.

తాను చేసిన వివాదాస్పద ట్వీట్ వ్యాఖ్యలపై సింగర్ అభిజిత్ క్షమాపణ కోరుకుంటున్నానని చెప్పారు. సల్మాన్‌ ఖాన్‌ దృష్టిలో పడడం కోసం అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ట్వీట్ చేసిన సమయంలో తనను విమర్శించిన సెలబ్రిటీలు, ప్రముఖులపై కూడా మండిపడ్డారు.

English summary
An FIR was lodged against controversial singer Abhijeet Bhattacharya late Thursday night at Oshiwara police station after a 34-year old woman accused him of molesting her.
Please Wait while comments are loading...