Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాలీవుడ్ సెక్స్ రాకెట్: సినీ పెద్దల హస్తం.. కళామతల్లికి సేవ అని చెప్పేవారే, సంచలన వ్యాఖ్యలు!
చికాగోలో బట్టబయలైన టాలీవుడ్ తారల సెక్స్ రాకెట్ సంచలనం సృష్టిస్తోంది. పలువురు ప్రముఖ హీరోయిన్లు ఈ సెక్స్ రాకెట్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. యుఎస్ ఫెడరల్ ఏజెన్సీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. గతంలో కొన్ని చిత్రాలకు సహ నిర్మాతగా పనిచేసిన కిషన్, ఆయన సతీమణి చంద్ర ఈ సెక్స్ రాకెట్ నడిపిస్తున్నట్లు తేలింది. ఈ వ్యవహారం టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది.


మండిపడుతున్న మహిళా సంఘాలు
ఇటీవల కాస్టింగ్ కౌచ్ విషయం టాలీవుడ్ ని కుదుపునకు గురిచేయగా, తాజగాచికాగో సెక్స్ రాకెట్ సంచలనం సృష్టిస్తోంది. దీనిపై మహిళా సంఘాల నేతలు మండిపడుతున్నారు.

ఆ రెండు అంశాలపై
నేడు మహిళా సంఘాల నేతలు చికాగో సెక్స్ రాకెట్ పై మీడియా సమావేశం నిర్వహించారు. చిత్ర పరిశ్రమలోని మొత్తం 24 క్రాఫ్ట్స్ మహిళా సంఘాల తరుపున తాము కాస్టింగ్ కౌచ్, చికాగో సెక్స్ రాకెట్ పై మాట్లాడుతున్నాం అని తెలిపారు.

క్యాష్ కమిటీ అన్నారు
చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న వేధింపులని అరికట్టేందుకు క్యాష్ కమిటీ వేస్తామని చెప్పారు. ఇంత వరకు ఆ ప్రస్తావనే లేదని మహిళాసంఘ నాయకురాలు దేవి మండిపడ్డారు. ఈ విషయంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిత్ర పరిశ్రమతో మూడు సార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేదని అన్నారు.

యాక్టింగ్ స్కూల్స్‌లో కూడా
చివరకు యాక్టింగ్ స్కూల్స్, డాన్సింగ్ స్కూల్స్ లో కూడా మహిళలకు వేధింపులు తప్పడం లేదు అని అన్నారు. చిత్ర పరిశ్రమలో బ్రోకర్ వ్యవస్థ ఉండకూడదని డిమాండ్ చేశారు.

కళామతల్లికి సేవ అని చెప్పేవారే
మహిళా హక్కుల కార్యకర్త సుజయ మాట్లాడుతూ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కళామతల్లికి సేవ అని చెప్పే వారే మహిళలని బలిపశువులుగా మారుస్తున్నారని విమర్శించారు. బాధిత మహిళలు కనీసం మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొని ఉందని ఆమె అన్నారు.

సినీ పెద్దల హస్తం
అమెరికాలో జరిగిన సెక్స్ రాకెట్ లో సినీ పెద్దల హస్తం ఉందని మహిళా సంఘాలు ఆరోపించాయి. ఈ వ్యవహారంలో నిజా నిజాలు బయటకు రావాలని అన్నారు.